Anushka Shetty: మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోతో మూడు స్టార్లు ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం ఏంటి?

అనుష్క- ప్రభాస్, విజయ్ దేవరకొండ-రష్మిక ఇలా కొన్ని కాంబోలో సినిమాలను కోరుకుంటారు. అలాగే రామ్ చరణ్ అనుష్క కాంబినేషన్ కూడా బాగుంటుంది కానీ ఇప్పటికీ ఒక్క సినిమా కూడా రాలేదు.

Written By: Suresh, Updated On : November 9, 2023 11:33 am

Anushka Shetty

Follow us on

Anushka Shetty: కొన్ని కాంబినేషన్ ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. డైరెక్టర్ హీరో కాంబినేషన్, హీరో హీరోయిన్ కాంబినేషన్ ఇలా కొన్ని కాంబోలో సినిమాలు రావాలని అనుకుంటారు. ఇక అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా చేయాలని ఎందరో అనుకుంటారు. కానీ ఇప్పటికీ అయితే ఒక్క సినిమా కూడా రాలేదు. భవిష్యత్తులో వస్తుందా అని అడుగుతుంటారు కొందరు. ఇదిలా ఉంటే హీరో హీరోయిన్ జోడి లో కొన్ని రేర్ కాంబినేషన్ లు ఉంటాయి. ఇలాంటి కాంబోలో రిపీట్ రిపీట్ వచ్చినా కూడా ఇష్టంగా చూస్తుంటారు.

అనుష్క- ప్రభాస్, విజయ్ దేవరకొండ-రష్మిక ఇలా కొన్ని కాంబోలో సినిమాలను కోరుకుంటారు. అలాగే రామ్ చరణ్ అనుష్క కాంబినేషన్ కూడా బాగుంటుంది కానీ ఇప్పటికీ ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే వీరి కాంబోలో మూడు సినిమాలు రావాల్సి ఉండేవి. కానీ అవి అనుష్క వల్లనే క్యాన్సల్ అయ్యాయి. ముందుగా మగధీర సినిమాలో అనుష్కనే అనుకున్నారట. రాజమౌళి ఈ సినిమా కోసం ముందుగా అనుష్కనే అనుకున్నాడట. ఈ ఆఫర్ ను అనుష్కనే రిజక్ట్ చేయడంతో జక్కన్న కాజల్ ను కలిశాడట.

ఈ సినిమా తర్వాత రచ్చ సినిమా కోసం కూడా అనుష్కనే అనుకున్నాడట డైరెక్టర్ సంపత్. కానీ కథ నచ్చలేదని రిజక్ట్ చేసింది అమ్మడు. ఫైనల్ గా గోవిందుడు అందరివాడేలే సినిమా కోసం కూడా అనుష్కను అడిగారట. కానీ ఆ సమయంలో స్వీట్ వేరే సినిమాతో బిజీగా ఉండడంతో మళ్లీ రిజక్ట్ చేసిందట. ఇలా మూడు రామ్ చరణ్ సినిమాలను రిజెక్ట్ చేసింది అనుష్క. దీంతో వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేకపోయింది. ఇక వస్తుందనే నమ్మకం కూడా లేదంటున్నారు ఇద్దరి స్టార్ల అభిమానులు.