https://oktelugu.com/

Nidhi Agarwal: మంచి అబ్బాయి కోసం వెయిటింగ్ అంటున్న అందాల భామ… నిధి అగర్వాల్

Nidhi Agarwal: నిధి అగర్వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ షేర్ చేసి యూత్ మనసును ఫిదా చేస్తారు ఈ అమ్మడు. ” సవ్యసాచి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు నిధి అగర్వాల్. ఆ తర్వాత “మిస్టర్‌ మజ్నూ” సినిమా తో కాస్త క్రేజ్ పెంచుకున్నారు ఈ ముద్దుగుమ్మ. రొమాంటిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో” ఇస్మార్ట్ శంకర్” సినిమాలో తన అందాల ఆరబోతతో మంచి హీరోయిన్ గా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 02:37 PM IST
    Follow us on

    Nidhi Agarwal: నిధి అగర్వాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ షేర్ చేసి యూత్ మనసును ఫిదా చేస్తారు ఈ అమ్మడు. ” సవ్యసాచి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు నిధి అగర్వాల్. ఆ తర్వాత “మిస్టర్‌ మజ్నూ” సినిమా తో కాస్త క్రేజ్ పెంచుకున్నారు ఈ ముద్దుగుమ్మ. రొమాంటిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో” ఇస్మార్ట్ శంకర్” సినిమాలో తన అందాల ఆరబోతతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందారు నిధి. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది నిధి.

    ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా ట్విట్టర్ వేదికగా పింక్‌ కలర్‌ చీరలో దిగిన కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫొటోస్ లో నిధి నిజంగానే అందాలను తనలో దాచుకున్న నిధిగా కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోస్ తో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్‌ ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ‘ఒక అందమైన, మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను’ అనే క్యాప్షన్‌ను పోస్ట్ కి పెట్టడంతో నిధి మనసు పెళ్లిపై పడిందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ క్యాప్షన్‌తో పాటు ఆమె జత చేసిన కొన్ని స్మైలీ సింబల్స్‌ చూస్తుంటే నిధి అగర్వాల్‌ తమాషాగా ఈ పోస్ట్‌ చేసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సరసన “హరి హర వీరమల్లు” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలానే అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న చిత్రం “హీరో” మూవీలో కూడా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.