https://oktelugu.com/

83 Movie: 83 సినిమా తెలుగు ట్రైలర్ విడుదల… గూస్ బంప్స్ గ్యారంటీ

83 Movie: క్రికెట్ చరిత్రలో 1983వ సంవత్సరం మర్చిపోలేనిది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన టీమిండియా ప్రపంచకప్ ను కొల్లగొట్టి భారతీయులందరికి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది కపిల్ దేవ్ అని అందరికీ తెలిసిందే. ఈ యథార్ధ ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘83’. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ నటించారు. ఆయనకు జంటగా దీపికా పదుకునే నటించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 02:27 PM IST
    Follow us on

    83 Movie: క్రికెట్ చరిత్రలో 1983వ సంవత్సరం మర్చిపోలేనిది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన టీమిండియా ప్రపంచకప్ ను కొల్లగొట్టి భారతీయులందరికి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది కపిల్ దేవ్ అని అందరికీ తెలిసిందే. ఈ యథార్ధ ఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘83’. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ నటించారు. ఆయనకు జంటగా దీపికా పదుకునే నటించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా చిత్రయూనిట్ తాజాగా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసింది.

    83 Movie

    కబీర్​ ఖాన్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, కబీర్ ఖాన్, దీపికా పదుకొనే, విష్ణు వర్దన్ ఇందూరి, సజీద్ నదియాద్‌వాలా నిర్మాతలు గా చేస్తున్నారు. ఈ సినిమాలో కపిల్​దేవ్​ పాత్రను రణ్​వీర్​ సింగ్​ పోషించారు. తమిళ నటుడు జీవా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. దీపికా పదుకొనే, కిచ్చా సుదీప్​, జీవా, పంకజ్​ త్రిపాఠి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్లో భారత జట్టు ప్రయాణం, వారి పడిన మాటలు, కష్టాలు చివరికి వారి గెలుపు వరకు మనల్ని తీసుకెళుతుంది. కపిల్ దేవ్ పెట్టిన ప్రెస్ మీట్ కు నలురైదుగురు విదేశీ ప్రెస్ రిపోర్టర్లు మాత్రమే వస్తారు. అందులో ఒక రిపోర్టర్ ‘మీరేమనుకుంటున్నారు మీ టీమ్ వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందా’ అని అడుగుతాడు.

    Also Read: ట్రైలర్ టాక్ : కపిల్ దళం చేసిన అద్భుత సమ్మేళనమే ’83’ !

    దానికి కపిల్ ‘మేమిక్కడికి గెలవడానికే వచ్చాం’ అని సమాధానం చెబుతాడు. దానికి ప్రెస్ రిపోర్టర్లంతా ‘ఏంటీ ? వరల్డ్ కప్ గెలవడానికా?’ అని నవ్వుతారు. అదే కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచాక ప్రెస్ మీట్ పెడితే రిపోర్టర్లతో హాలు నిండిపోతుంది. అప్పుడు కపిల్ ‘నేను ముందే చెప్పానుగా… మేమిక్కడికి గెలవడానికే వచ్చాం’ అనగానే హాలు చప్పట్లతో మారుమోగుతుంది. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. కేవలం హిందీలోనే కాదు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో త్రీడీలో విడుదల చేయనున్నారు.

    Also Read: సెన్సార్ పూర్తి చేసుకున్న గుడ్ లక్ సఖి చిత్రం…