https://oktelugu.com/

డ్రైవర్ ను ‘ముమైత్ ఖాన్’ మోసం చేయడం వెనుక..?

ప్రస్తుతం ముమైత్ ఖాన్ ఓ డ్రైవర్ ను మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తోంది. ఈ ఐటెమ్ బాంబ్ తన గోవా పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు అనే అతని క్యాబ్‌ ని బుక్ చేసుకుందట, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వలేదని.. నన్ను మోసం చేసిందని ఆ డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. పైగా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌ లో చర్చించి పోలీసులకు ఫిర్యాదు కూడా […]

Written By:
  • admin
  • , Updated On : September 30, 2020 / 03:52 PM IST
    Follow us on


    ప్రస్తుతం ముమైత్ ఖాన్ ఓ డ్రైవర్ ను మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తోంది. ఈ ఐటెమ్ బాంబ్ తన గోవా పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు అనే అతని క్యాబ్‌ ని బుక్ చేసుకుందట, అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం ఇవ్వలేదని.. నన్ను మోసం చేసిందని ఆ డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. పైగా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌ లో చర్చించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తానని కూడా ఆ డ్రైవర్ హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ గోవాలో ఏమి జరిగింది అంటే.. మొదట మూడు రోజులని చెప్పిన ముమైత్… మరో ఐదు రోజులు పొడగించి మొత్తం 8 రోజులు క్యాబ్‌ సర్వీస్ వాడుకుందని… అయితే ఆ 8 రోజులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండానే ముమైత్ వెళ్లిపోయిందని డ్రైవర్ రాజు చెప్పుకొస్తున్నాడు.

    Also Read: టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

    ఆమె తనను ఘోరంగా మోసం చేసిందని.. తనలా మరొకరు అన్యాయానికి గురి కాకూడని మీడియా ముందుకు వచ్చానని రాజు చెబుతున్నాడు. అయినా కనీసం టోల్‌ చార్జీలు, తిండి ఖర్చులు,అకామడేషన్‌ డబ్బులు కూడా ఇవ్వనప్పుడు మరి ఎనిమిది రోజులు రాజు ఎందుకు ఉచిత సేవ చేశాడో రాజుకే తెలియాలి. రాజు చెప్పినదానిలో వాస్తవం ఉంది అనుకున్నా.. రాజుకు ముమైత్ నుంచి రూ.15 వేలు మాత్రమే రావాల్సి ఉందట. కేవలం రూ.15 వేలు కోసం రాజును మోసం చేసి ముమైత్ పారిపోయిందంటే కాస్త నమ్మశక్యం కావడంలేదు. అయితే డ్రైవర్‌ రాజు ఆరోపణల పై ముమైత్ కి సంబందించిన వ్యక్తుల చెబుతున్న వివరణ ప్రకారం.. రాజుకి ముమైత్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసిందని. కానీ లాక్ డౌన్ అంటూ రాజు ఆమె నుండి ఎక్కువ ఆశించాడు అని చెబుతున్నారు.

    Also Read: బిగ్ బాస్ పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు

    ఏమైనా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ టాలీవుడ్ ను అప్పట్లో ఓ ఊపే ఊపేసిన ముమైత్ ఖాన్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. అసలు ఐటమ్ సాంగ్‌లు చేసే భామకి ఈ జనరేషన్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు, అంతలా ముమైత్ ఖాన్ స్పెషల్ సాంగ్‌ ల్లో రాణించింది. పైగా ముమైత్ ఖాన్ ఆ మధ్య కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అయితే అవి అంతగా సక్సెస్ కాలేకపోవడంతో చాన్స్ లు లేక బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో కూడా పాల్గొని మళ్ళీ ఫేమ్ తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసినా సక్సెస్ కాలేదు.