https://oktelugu.com/

ఆ హీరోయిన్లు వ్యభిచార దందా కూడా నడిపారా ?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ విషయం కూడా బయటకి రావడం.. దాంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చాటింగ్‌ లో డ్రగ్స్ గురించిన వివరాల పై విచారణ చేయడం.. ఆ రకంగా కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ ప్రకంపనలతో గత కొన్ని రోజులుగా వణికిపోతూ ఉండటం.. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను అరెస్ట్ చేసేయడం.. తెలిసిన సంగతే. అయితే రాగిణి, సంజనా ఫోన్లలో నీలి చిత్రాలు, […]

Written By:
  • admin
  • , Updated On : September 30, 2020 4:02 pm
    Follow us on


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ విషయం కూడా బయటకి రావడం.. దాంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చాటింగ్‌ లో డ్రగ్స్ గురించిన వివరాల పై విచారణ చేయడం.. ఆ రకంగా కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ ప్రకంపనలతో గత కొన్ని రోజులుగా వణికిపోతూ ఉండటం.. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను అరెస్ట్ చేసేయడం.. తెలిసిన సంగతే. అయితే రాగిణి, సంజనా ఫోన్లలో నీలి చిత్రాలు, అసభ్యకరమైన ఫోటోలు ఉన్నాయనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పైగా వాట్సాఫ్ లో సపరేట్ గ్రూప్ పెట్టి వ్యభిచార దందా నడిపిస్తున్నారని కూడా ఈ హీరోయిన్ల పై ఆరోపణలు వస్తుండటం నిజంగా అందర్నీ షాక్ కి గురి చేస్తోంది.

    Also Read: పవన్ తో బండ్ల గణేష్ సినిమా.. ఓ హాట్ టాపిక్

    ఇప్పటికే ఈ ఆరోపణల పై పోలీసులు కూడా విచారించేందుకు సిద్దమవుతున్నారని.. ఈ స్కామ్ తో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించారని కన్నడనాట వినిపిస్తోన్న టాక్. అయితే రాగిణి ద్వివేది, సంజనల మొబైల్‌ ఫోన్లలో నీలి దందా కోసం ఉన్న ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపును డ్రగ్స్‌ కేసు బయటపడగానే డిలిట్‌ చేశారట. నిజంగానే అలాంటి గ్రూప్ ఉందా.. ? ఉంటే దానిలో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తోనట్లు తెలుస్తోంది. ఇక రాగిణి ద్వివేది, సంజన ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగానే ప్రస్తుతం సీసీబీ పోలీసులు కొందరిని ఆఫీసుకు పిలిపించుకుని విచారిస్తున్నారు.

    Also Read: డ్రైవర్ ను ‘ముమైత్ ఖాన్’ మోసం చేయడం వెనుక..?

    రాగిణి సన్నిహితులిద్దరిని ఇప్పటికే చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించగా… రాగిణి గతంలో డ్రగ్స్‌ వ్యాపారం చేసినట్లు ఆ విచారణలో తేలిందని కూడా వార్తలు వచ్చాయి. కన్నడ పరిశ్రమలోను గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ దందా మొన్నటివరకూ నడుస్తున్నట్టు ఆ విచారణలో తేలింది. పైగా డ్రగ్స్‌ డీలర్‌ అనికా కొంతమంది కన్నడ హీరోయిన్స్ తో పాటు నటులు, సంగీత కళాకారులు డ్రగ్స్ వాడతారని ఎన్‌సిబీ అధికారులకి స్పష్టం చేసింది. వారికీ తానూ డ్రగ్స్ ని వాటి అసలు పేర్లతో కాకుండా కోడ్ పేర్లతో సరఫరా చేస్తానని.. తన దగ్గరినుంచి కన్నడ సినిమా పరిశ్రమ నుండి మొత్తం 30 మంది డ్రగ్స్ తీసుకున్నారని అనికా పోలిసుల విచారణలో ఒప్పుకుంది.