Mehreen Pirzada: బికినీ వేసిన ఎఫ్2 బేబీ… మెహ్రీన్ ని ఇలా చూసి తట్టుకోవడం కష్టమే! వైరల్ పిక్స్

Mehreen Pirzada: తెలుగులో రెండో చిత్రం మహానుభావుడు(Mahanubhavudu). శర్వానంద్-మారుతి కాంబోలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది.

Written By: S Reddy, Updated On : June 1, 2024 11:31 am

Actress Mehreen Pirzada Bikini Pics goes viral

Follow us on

Mehreen Pirzada: కెరీర్ సంగతి ఎలా ఉన్నా మెహ్రీన్ ఫిర్జాడా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లో విహరిస్తోంది. తాజాగా బికినీలో దర్శనమిచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది. కాగా మెహ్రీన్ టాలీవుడ్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ(Krishna Gaadi Veera Prema Gaadha) చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సూపర్ హిట్ కొట్టింది. మెహ్రీన్ గ్లామర్ యూత్ ని కట్టిపారేసింది.

తెలుగులో రెండో చిత్రం మహానుభావుడు(Mahanubhavudu). శర్వానంద్-మారుతి కాంబోలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. మూడో చిత్రం రాజా ది గ్రేట్(Raja the Great) సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మెహ్రీన్ కి మంచి ఆరంభం లభించినా దాన్ని కొనసాగించలేకపోయింది. కేరాఫ్ సూర్య, పంతం, నోటా ఇలా వరుస ప్లాప్స్ పడ్డాయి.

Also Read: Devara Fear Song: యూట్యూబ్ ని దున్నేస్తున్న దేవర ఫియర్ సాంగ్… ఎన్ని కోట్ల మంది చూశారో తెలుసా?

అనిల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రంతో మెహ్రీన్ కి బ్రేక్ ఇచ్చాడు. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. హనీ పాత్రలో మెహ్రీన్ ఆకట్టుకుంది. ఎఫ్ 2 అనంతరం మరలా ఆమెకు ప్లాప్స్ పడ్డాయి. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మెహ్రీన్ కెరీర్ ప్రమాదంలో పడింది. 2021లో భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ కి ఎంగేజ్మెంట్ జరిగింది.

Also Read: Nivetha Pethuraj: హీరోయిన్ నివేద పేతురాజ్ కారు డిక్కీలో శవం… అసలు నిజం వెలుగులోకి..!

కారణం తెలియదు కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. గత ఏడాది స్పార్క్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. ప్రస్తుతం ‘నీ సిగువెరుగు’ అనే టైటిల్ తో ఒక కన్నడ చిత్రం చేస్తుంది. కాగా సెంట్రల్ అమెరికాలోని బెలీజె బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది మెహ్రీన్. సమ్మర్ వెకేషన్ కోసం అక్కడికి వెళ్ళింది. అక్కడి అందమైన సముద్ర తీరంలో సేద తీరుతుంది. బికినీలో హాట్ గా ఉన్న మెహ్రీన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.