https://oktelugu.com/

Honey Rose : పైట లేకుండా కెమెరా ముందు ఆ ఫోజులేంటి బాబోయ్… బాలయ్య హీరోయిన్ బోల్డ్ షో వీడియో వైరల్

వివాహ బంధం విజయవంతం అయ్యేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను అని చెప్పింది. మరి హనీ రోజ్ ని పెళ్లాడే వాడిదే అదృష్టం అని చెప్పొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2023 / 10:02 PM IST
    Follow us on

    Honey Rose : టీనేజ్ లోనే పరిశ్రమలో అడుగుపెట్టింది హనీ రోజ్. చాలా గ్యాప్ తర్వాత వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డిలో బాలయ్య భార్యగా, తల్లిగా రెండు విభిన్న పాత్రలు చేసింది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ సాంగ్ లో క్రేజీ స్టెప్స్ తో అలరించింది. వీరసింహారెడ్డి సూపర్ హిట్ కాగా హనీ రోజ్ పేరు టాలీవుడ్ లో మారు మ్రోగింది.

    హనీ రోజ్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయని భావించారు. అయితే ఆ సూచనలేమీలేవు. అధికారికంగా తెలుగులో హనీ రోజ్ చిత్రాలు ప్రకటించలేదు. ఇతర భాషల్లో రెండు చిత్రాలు చేస్తుంది. రాచెల్, తేరి మేరీ చిత్రాల్లో హనీ రోజ్ నటిస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే 2008లోనే హానీ రోజ్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. శివాజీ హీరోగా తెరకెక్కిన ఆలయం చిత్రంలో హీరోయిన్ గా చేసింది.

    ఆ సినిమా ఆడలేదు. దాంతో గ్యాప్ వచ్చింది. మరో ఆరేళ్ళ తర్వాత వరుణ్ సందేశ్ తో జతకట్టింది. 2014లో విడుదలైన ఈ వర్షం సాక్షిగా చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా నిరాశపరిచింది. దాదాపు 9 ఏళ్ళ అనంతరం వీరసింహారెడ్డి చిత్రం చేసింది. మలయాళ భామ అయిన హనీ రోజ్ ప్రస్తుత వయసు 32. ఆమెకు ఇంకా చాలా కెరీర్ ఉంది. నటిగా, మోడల్ గా భారీగా సంపాదిస్తుంది.

    ఆ మధ్య హైదరాబాద్ కి ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చింది. హనీ రోజ్ ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కుర్రాళ్లతో హానీ రోజ్ క్రేజ్ చూసి అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు కాకరేపుతుంటారు. ఈ స్టార్ లేడీ గ్లామరస్ ఫోటో షూట్స్ కి బాగా ఫేమస్. తాజాగా పైట లేకుండా మలయాళీ కుట్టి అవతారంలో మెస్మరైజ్ చేసింది. అమ్మడు సాంప్రదాయ లుక్ సైతం హీటెక్కించే విధంగా ఉంది. దాంతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

    ఆ మధ్య పెళ్లిపై హనీ రోజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్ళి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. వివాహ బంధం విజయవంతం అయ్యేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను అని చెప్పింది. మరి హనీ రోజ్ ని పెళ్లాడే వాడిదే అదృష్టం అని చెప్పొచ్చు.