Star Heroine: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవడానికి సామాన్య మానవుడు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అందువల్లే వాళ్ళ జీవితంలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా అది పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారుతుంది.ఇప్పుడు ఇషా డియోల్ ని కూడా అలాగే ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇషా డియోల్ 2012 వ సంవత్సరంలో భరత్ ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే..
ఇక వీళ్ళ 12 సంవత్సరాల కాపురానికి గాను ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. కానీ వీళ్లు అనుకోని కొన్ని సంఘటన వల్ల ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడాకులను తీసుకున్నారు. ఇక అప్పటినుంచి ఇషా డియోల్ తన అందం మీద మళ్ళీ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తన తల్లి అయిన హేమమాలని ఉత్తర ప్రదేశ్ లోని మధుర నుంచి బిజెపి ఎంపీగా కాంటెస్ట్ చేస్తుంది. ఇక తన తల్లి గెలుపు కోసం ఇషా డియోల్ తీవ్రమైన కసరత్తులు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తుంది.
అయితే ఈ ప్రచారంలో తనని చూసిన అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు చాలా బాగుండేది ఇప్పుడు సర్జరీ చేయించుకున్నట్టు ఉంది. అసలేం బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే విడాకులు తీసుకున్న కొద్దిరోజుల్లోనే మళ్లీ అందంపై దృష్టి పెట్టింది. మళ్ళీ సినిమాల్లో చేస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రచారాన్ని మాత్రమే చేస్తూ ఆ ప్రచారాన్ని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక అందులో బాగంగానే కొన్ని గుడులు, గోపురాల చుట్టూ కూడా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది…
మరి మొత్తానికైతే ఇషా డియోల్ మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే తను మాత్రం వీటిని పట్టించుకోకపోవడమే ఉత్తమమని తన పని తను చేసుకుంటూ సాగడమే తన లక్ష్యమని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది…