Archana: హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లగా కనుమరుగైనప్పటికీ.. బిగ్బాస్ షోలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకుల మనసుకు చేరువైన నటి అర్చన. అయితే, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అర్చన. సినీ పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ తెలుగు దర్శకుడు తనను హింసించేవాడని చెప్పింది. రోజూకోసారి డైలాగ్స్ మార్చేవాడని.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతన్ని చూశాక మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించిందని పేర్కొంది.

సెట్‌లో ఆ దర్శకుడు డిఫరెంట్‌గా ఉండేవాడు.అయితే, నేను ఎక్కడ సినిమా వదిలేస్తానోనని నిన్ను ఇంటికొచ్చి కలిసి మాట్లాడతాను అంటూ ఎవో మాటలు కలిపేవాడు. అలా ఓసారి ఇంటికొచ్చినప్పుడు మీరు చేసేది ఒకది చెప్పేది ఇంకొకటి ఇది సరైన పద్దతి కాదని నేను అతనికి చెప్పా. అయితే, అతడు కాకమ్మ కబుర్లు చెప్తూ తియ్యగా మాట్లాడుతూ నా బ్రెయిన్ వాష్ చేసేవాడు. అతడి మాటలు విని.. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకుని మళ్లీ షూటింగ్‌కు వెళ్లేదాన్ని. కానీ సెట్‌లో చాలా ఇరిటేషన్ వచ్చింది. అలా ఒకరోజు నువ్వు నాకు పైసా కూడా ఇవ్వకు అని ముఖం మీదే చెప్పి వచ్చేశా. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అని చెప్పుకొచ్చింది.
మరోవైపు తనకు తెలియకుండా ఓ హీరో తన గురించి కొన్ని గాసిప్స్ సృష్టించారని పేర్కొంది. ఆ హీరో అందరికీ తెలుసని.. చూడగానే చాలా సింపుల్, సీదాగా ఉన్నారనిపిస్తుందని.. కానీ అతని నిజస్వరూపం వేరని చెప్పింది. చాలా వంకర ఆలోచనలు ఉంటాయని పేర్కొంది. అందమైన అమ్మాయిలు, అందులోనూ ఎవరి అండాలేని వారు సెట్‌లో కనిపిస్తే వాళ్లను వశపరుచుకునేందుకు రెడీగా ఉంటారని చెప్పుకొచ్చింది అర్చన.