https://oktelugu.com/

Action Hero: ఈ ఫొటోలో ఉన్న పిల్లాడిని గుర్తుపట్టగలరా… తరచూ పెళ్లి రూమర్లతో వార్తల్లో నిలిచే యాక్షన్ హీరో..

Action Hero: ఈ పిల్లాడు ఇప్పుడు పెద్దవాడు అయ్యి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.యాక్షన్ హీరోగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.కోలీవుడ్ హీరో అయినప్పటికీ కూడా ఈ హీరోకు తెలుగు రాష్ట్రాలలో బాగా ఫాలోయింగ్ ఉంది.అందుకే అతని ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2024 / 05:36 PM IST
    Actor Vishal Childhood Photo Goes Viral On Internet

    Actor Vishal Childhood Photo Goes Viral On Internet

    Follow us on

    Action Hero: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు,వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫోటోలలో ఉన్నది ఎవరా..అని కనిపెట్టేందుకు నెటిజన్లు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చాల మంది సినిమా హీరోల,హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఇప్పుడు పైన ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఒక పిల్లాడి ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

    ఈ పిల్లాడు ఇప్పుడు పెద్దవాడు అయ్యి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.యాక్షన్ హీరోగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.కోలీవుడ్ హీరో అయినప్పటికీ కూడా ఈ హీరోకు తెలుగు రాష్ట్రాలలో బాగా ఫాలోయింగ్ ఉంది.అందుకే అతని ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది.సినిమాల విషయం పక్కన పెడితే పెళ్లి రూమర్ల విషయంలో కూడా తరచూ వార్తల్లో ఉంటాడు.

    పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఎవరైనా అడిగితే టాలీవుడ్ లో ప్రభాస్,బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని సరదాగా చెప్తుంటాడు.ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్న ఈ హీరో ఎవరో కాదు యాక్షన్ హీరో గా పేరుతెచ్చుకున్న కోలీవుడ్ హీరో విశాల్.ఈ మధ్యకాలం లో విశాల్ ఎక్కువగా పెళ్లి రూమర్లతో వార్తల్లో ఉంటున్నాడు.హీరో విశాల్ మొదటి ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే.లక్ష్మీ మేనన్,అభినయ లతో కూడా విశాల్ పెళ్లి జరగబోతుంది అని వార్తలు వచ్చాయి.

    కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది.హైదరాబాద్ కు చెందిన అనిషా విల్లా తో విశాల్ నిశ్చితార్ధం 2019 లో జరిగింది.కానీ పలు కారణాల వలన పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని ప్రకటించాడు.ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే రత్నం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో విశాల్ కు జోడిగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.