Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వలన కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగక కాళ్ళ నొప్పులు వస్తుంటాయి.కానీ ఈ విషయం చాల మందికి తెలియదు.శరీరంలో కాల్షియం లోపం వలన లేదా రక్తం లేకపోవడం వలన కాళ్ళ నొప్పులు వస్తాయని చాల మంది భావిస్తారు.ప్రస్తుతం ఉన్న తప్పుడు ఆహారపు అలవాట్లు,మారుతున్నా జీవనశైలి కారణం గా చాల మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రతి మనిషి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాల ముఖ్యం.శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ అనేక వ్యాధులకు కారణం అవుతుంది అన్న సంగతి అందరికి తెలిసిందే.శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ గుండె కు హాని కలిగిస్తుంది.గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.అయితే శరీరం లో అధికంగా చెడు కొలెస్ట్రాల్ ఉండటం వలన కాళ్ళలో కూడా నొప్పులు వస్తాయని చాల మందికి తెలియదు అని చెప్పచ్చు.మీకు కాళ్ళలో నొప్పి ఎక్కువ కాలం నుంచి ఉన్నట్లయితే అది చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన కూడా కావచ్చు.
దీనినే పెరిఫెరల్ ఆర్జరీ డిసీస్ అంటారు అని నిపుణులు చెప్తున్నారు.కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాళ్ళలో దీర్ఘకాలంగా నొప్పులు ఉంటాయి.అయితే చాల మంది దీనిని కాల్షియం లోపం,రక్తం లేకపోవడం అని అనుకుంటారు.కానీ అవేమి లేకపోయినా మీకు ఎక్కువ కాలం నుంచి కాళ్ళ నొప్పులు ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేసుకోవడం మంచిది.
WHO అంచనాల ప్రకారం మన దేశం లో 30 శాతం మందికి కొలెస్ట్రాల్ సమస్య ఉంది.కానీ దానిలో చాల మందికి దీని గురించి అవగాహన లేదని చెప్పచ్చు.ఢిల్లీ లోని సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజయ్ కుమార్ పెరిఫెరల్ ఆర్జరీ డిసీస్ గురించి మాట్లాడుతూ కాళ్ళ నొప్పులు వస్తాయని,మరికొంత మందిలో బిగుసుకుపోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలిపారు.ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది అని ఆయన తెలిపారు.