Actor Vikram: ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తో సినిమా చేయనున్న హీరో విక్రమ్…

Actor Vikram: వైవిధ్యమైన సినిమాలతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు తమిళ స్టార్ హీరో విక్రమ్. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. తన పాత్ర కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఈ హీరో. ఇక విక్రమ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విక్రమ్. అపరిచితుడు సినిమా నుంచి ఐ చిత్రం వరకు తన పాత్ర కోసం […]

Written By: Raghava Rao Gara, Updated On : December 3, 2021 12:16 pm
Follow us on

Actor Vikram: వైవిధ్యమైన సినిమాలతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు తమిళ స్టార్ హీరో విక్రమ్. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. తన పాత్ర కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు ఈ హీరో. ఇక విక్రమ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విక్రమ్. అపరిచితుడు సినిమా నుంచి ఐ చిత్రం వరకు తన పాత్ర కోసం తనను తాను మార్చుకుంటుంటాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విశేషమేంటంటే.. ఈ సినిమాలో హీరో విక్రమ్‏తో ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే ఇప్పుడు తాజాగా పా. రంజిత్ ఓ సినిమా చేయనున్నారు. వీళ్లిద్దరి కాంబినేష‌న్‌లో తొలి సినిమా ఇది. హీరో విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ కాంబినేష‌న్‌లో సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేయనున్నారు. గతంలో కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వం వహించిన ‘మద్రాస్’ సినిమాను ఆ సంస్థే నిర్మించింది. విక్రమ్, పా రంజిత్ కలయికలో రూపొందనున్న ఈ సినిమా గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు స్టూడియో గ్రీన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హీరోగా విక్రమ్ 61వ చిత్రమిది. ఇప్పటివరకూ పా. రంజిత్ చేసిన సినిమాలు గమనిస్తే… దళిత నేపథ్యంలో తీశారు. ఇప్పుడు విక్ర‌మ్‌తో ఈ తరహా సినిమా తీస్తారని ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని స్టూడియో గ్రీన్ సంస్థ తెలియజేసింది.

https://twitter.com/StudioGreen2/status/1466369090717577218?s=20