Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ విశేష ఆదరణ తగ్గించుకుని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప సౌందర్య మాట్లాడుతూ ఉంటారు. దీప ఎన్నో కష్టాలు పడిందనిఈ 11 సంవత్సరాలలో ఏ రోజు తన కొడుకు గురించి ఆలోచించలేదని తన గురించి ఆలోచించాలని ఎమోషనల్ అవుతుంది. ఇలా సౌందర్య బాధ పడటం తో దీప మాట్లాడుతూ ఇకపై మీరు మోనిత గురించి మర్చిపోండి తనపని నేను చూసుకుంటా అంటూ తనకు ధైర్యం ఇస్తుంది.

మరోవైపు మోనిత ఇంట్లో ప్రియమని సామాన్లన్నీ పడేస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వెళ్ళిన
మోనిత ఏం జరిగిందని అనడంతో అసలు మీకు చీము నెత్తురు పౌరుషం ఉన్నాయా.. ఇన్ని అవమానాలు ఎలా పడుతున్నారు. మీ ఉప్పు తింటున్న నాకే ఇంత పౌరుషం వస్తుంది అంటూ మోనితను రెచ్చ కొడుతుంది. ఇక నేను ఏమి పట్టనట్టు లేను ఆ దీప పని చెబుతా అనడంతో ప్రియమణి పెదాలపై చిరునవ్వు వస్తుంది.మరోవైపు కార్తీక్ హాస్పిటల్ లో ఒక మహిళ ఇద్దరు పిల్లలను తీసుకు వచ్చి తన భర్త ప్రాణాలను కాపాడాలని ప్రాధేయ పడటంతో వెంటనే ఆ వ్యక్తిని ఆపరేషన్ థియేటర్ కి తరలిస్తారు.
Also Read: వేదికపై మోనితను అవమానించిన దీప.. శుభవార్త అంటూ సంబరపడిన మోనిత!
ఇంటిలో సౌందర్య కార్తీక్ కోసం ఎదురుచూస్తూ కంగారు పడుతుంది.ఎంతసేపయినా కార్తీక్ రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తుండగా అప్పుడే శ్రావ్య వచ్చి దీప గురించి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పిన సౌందర్య వినిపించుకోదు.ఏంటతయ్య టెన్షన్ లో ఉన్నారు అని అడగడంతో కార్తీక్ ఇంకా రాలేదు తన కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పడంతో శ్రావ్య మనసు చివుక్కుమంటుంది.ఈవిడ గారికి ఎప్పుడు పెద్ద కొడుకు కోడలు అంటేనే అభిమానం మా గురించి అసలు పట్టించుకోదు అంటూ తన మనసులో ఒక రకమైన భావన ఏర్పరచుకుంటుంది. ఇక గుడ్ న్యూస్ ఏంటి అని అడగగా ఇప్పుడు చెప్పిన మీరు పట్టించుకోరులే అంటూ తన గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ సౌందర్య వినిపించుకో దు. దీంతో శ్రావ్య బాధగా వెళ్తుంది.
మరోవైపు కార్తిక్ ఆపరేషన్ థియేటర్ లో స్పృహ లేకుండా ఆపరేషన్ చేస్తుంటాడు. రవి ఎంత ఆపినా కార్తీక్ అలాగే ఆపరేషన్ చేస్తూ ఉంటాడు అయితే ఆ వ్యక్తి చనిపోయాడని రవి గట్టిగా అరవడంతో ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు .. దీన్ని బట్టి చూస్తుంటే మరోసారి కార్తీక్ కి సమస్యలు వచ్చేలా ఉన్నాయని అర్థమవుతోంది.
Also Read: ‘బంగార్రాజు’ సినిమా నుంచి త్వరలో మంచి మెలోడీ సాంగ్.. ఆకట్టుకుంటున్న టీజర్