Homeఎంటర్టైన్మెంట్Thaman: "గాడ్ ఫాదర్" సినిమాలో సల్మాన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన తమన్...

Thaman: “గాడ్ ఫాదర్” సినిమాలో సల్మాన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన తమన్…

Thaman: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు దీటుగా లైన్ అప్ సాగిపోతున్నారు చిరంజీవి. ప్రస్తుతం చిరు, మోహన్ రాజా కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’  అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మంచి విజయం సాధించిన  సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేశారు. చిరు చేతికి గాయం కావడంతో ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. అయితే  ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

thaman gives clarity about salman role in chiru god father movie

మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారనే విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఆ రోల్ కోసం ఫైనల్ చేశారని అన్నారు. కానీ దీనిపై దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అలానే సినిమాలో ఓ పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాలన్నింటిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరు ‘గాడ్ ఫాదర్’ గురించి కూడా తమన్ పలు వ్యాఖ్యలు  చేశారు.  చిరంజీవి – సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేసే పాట కాబట్టి ఆ స్థాయికి తగ్గట్లుగా ఉండాలని బ్రిట్నీ స్పియర్ తో పాడించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా, మరేదైనా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీంతో ఈ సినిమాలో సల్మాన్ నటించబోతున్నాడని ఖరారు అయ్యింది. అలానే వీరిద్దరూ కలిసి డాన్స్ కూడా చేస్తారని తెలుస్తుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version