Homeఎంటర్టైన్మెంట్Punith Rajkumar: పునీత్​ బదులు నేను మరణిస్తే బాగుండేది-శరత్​ కుమార్​

Punith Rajkumar: పునీత్​ బదులు నేను మరణిస్తే బాగుండేది-శరత్​ కుమార్​

Punith Rajkumar: కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కూమార్​ మరణించి ఇప్పటికి నెలరోజులు కావస్తున్నా.. ఆయన మరణవార్తను అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్​ మరమంతో కన్నడ సినీ పరిశ్రమ మూగబోయింది. తీవ్ర దుఖఃంలో మునిగిపోయిింది. కాగా, ఇటీవల బెంగళూరు ప్యాలెస్​ గ్రౌండ్స్​లో పునీత్​ సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులూ పాల్గొన్నారు.

punith-rajkumar-wife-ashwani-respond-on-deaths-of-her-husbands-fans

ఈ కార్యక్రమంలోనే  తమిళ సీనియర్​ నటుడు శరత్​ కుమార్​ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పునీత్​ను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్​ బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేదని అన్నారు. ఇదే వేదికపై రాజ​కుమార​ సినిమా 100రోజుల వేడుక జరిగిందని.. ఇప్పుడు పునీత్​కు శ్రద్ధాంజలి జరుపుకోవాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. నా శ్రద్ధాంజలికి పునీత్​ వస్తాడనుకుంటే.. నేను ఆయన శ్రద్ధాంజలికి రావాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు.

కాగా, రాజ​కుమార సినిమాలో శరత్​కుమార్ పునీత్​కు తండ్రిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపించింది. పునీత్​ చివరి సినిమా జేమ్స్​లోనూ శరత్​ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

జిమ్​లో వర్క్​ఔట్స్​ చేస్తుండగా ఛాతి నొప్పితో బాధపడిన పునీత్​ వెంటనే ఆసుపత్రిలో చేరారు. అయితే, వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ పునీత్​ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆ తర్వాత పునీత్​ మరణాన్ని జీర్ణించుకోలేక చాలా మంది అభిమానులు మనస్థాపానికి లోనయ్యారు. కొంతమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కన్నడలో పునీత్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular