Suriya: ‘జై భీమ్’.. సూర్య నటించి, నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. సూర్య అభిమానులను అయితే మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తెలుగు – తమిళ భాషలతో పాటు ఇతర భాషల సినీ అభిమానులను కూడా బాగా అలరించింది. అందుకే, అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా క్రెడిట్ కొట్టేసింది.

డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా దేశమంతా హాట్ టాపిక్ అవడానికి కారణం.. ఈ సినిమాలో ఎమోషన్స్ అలాగే చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది. ఐతే, తమిళనాట మాత్రం ఈ చిత్రం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. తమిళనాడులో ‘వన్నియార్’ అనే సామాజిక వర్గం వారిని ఈ సినిమాలో కాస్త నెగిటివ్ కోణంలో చూపించారు.
దాంతో ఆ వర్గం వారు తమను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలను పెట్టారని ఈ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రచ్చకు దిగారు. కుల సంఘం వారు ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలని బాగా ఉబలాట పడ్డారు. ఇక పనిలో పనిగా ఈ సినిమా పై వ్యతిరేకంగా పీఎంకే అనే పార్టీ ఉద్యమాన్ని కూడా చేపట్టింది. ఇంతకీ ఈ పార్టీకి సినిమాకి సంబంధం ఏమిటంటే.. వన్నియార్ కులానికి ఈ పార్టీకి మధ్య దగ్గర సంబంధం ఉంది.
ఆ కులానికి చెందినదే ఈ పార్టీ. దాంతో ఈ విషయం పెద్దది అవుతుంది అనుకుంటున్న సమయంలో సూర్య రంగంలోకి దిగి ఇప్పటికే క్లారిటీగా వివరణ ఇచ్చారు. అయినా తమిళనాడులో ఇక నుంచి సూర్య చిత్రాలను బ్యాన్ చేస్తామని పీఎంకే పార్టీ బెదిరింపులకు కూడా దిగింది. అయితే,మిగిలిన తమిళ హీరోలు, పలువురు సెలబ్రిటీలు సైతం సూర్య కి మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read: Comedy Stars Promo: పెళ్ళైన మరుసటి రోజుకే జంప్ అయిన కమెడియన్ భార్య
ఐ స్టాండ్ విత్ సూరియా అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా పెడుతున్నారు. దాంతో ప్రస్తుతం ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు ఈ సినిమా కథ నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కింది. అలాంటప్పుడు ఎందుకు సూర్య క్షమాపణలు చెప్పాలి ? ఈ విషయంలో సూర్య వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటున్నాడు. మరోపక్క అధికార పార్టీ డీఎంకే కూడా సూర్యకే తమ సపోర్ట్ అంటుంది.
Also Read: Bigg Boss 5 Telugu Promo: నేను ఒంటరి వాడనంటూ షన్ను కంటతడి, బాత్రూం లో ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన సిరి