https://oktelugu.com/

Santhosh Shobhan: ప్రభాస్ అన్న నా ఇన్స్పిరేషన్ అంటున్న హీరో సంతోష్ శోభన్…

Santhosh Shobhan: గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యి… “తాను నేను” చిత్రంతో హీరోగా మారాడు సంతోష్ శోభన్. ఆ తర్వాత ఆయన నటించిన పేపర్ బాయ్ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇటీవల సంతోష్ హీరోగా నటించిన ” ఏక్ మినీ కథ”  చిత్రం ఓటిటి వేదికగా విడుదలై  మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మారుతి డైరెక్షన్ లో “మంచి రోజులు వచ్చాయి” […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 05:51 PM IST
    Follow us on

    Santhosh Shobhan: గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యి… “తాను నేను” చిత్రంతో హీరోగా మారాడు సంతోష్ శోభన్. ఆ తర్వాత ఆయన నటించిన పేపర్ బాయ్ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇటీవల సంతోష్ హీరోగా నటించిన ” ఏక్ మినీ కథ”  చిత్రం ఓటిటి వేదికగా విడుదలై  మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

    మారుతి డైరెక్షన్ లో “మంచి రోజులు వచ్చాయి” అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ యువ హీరో. ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా విడుదల కానుంది.  ఈ చిత్రంలో సంతోష్ కు  జోడీగా మెహరీన్ కౌర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా మంచి విజయం సాధించాయి.  డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినిమా తెరకెక్కించే మారుతి… ఈ చిత్రంలో సంతోష్ ని ఏ కోణంలో చూపించారు అనేది తెలుసుకోవాలంటే  ఈ దీపావళి వరకు ఆగాల్సిందే. అలానే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం మరో హైలైట్ అని చెప్పాలి.

    నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో సంతోష్ శోభన్ మాట్లాడుతూ… చిత్ర పరిశ్రమకు రావడానికి నా ఇన్స్పిరేషన్ ప్రభాస్ అన్న అని చెప్పారు.  మొదట్లో తనకు సినిమా అంటే ఏంటో తెలియదని… సినిమా ఎలా తీస్తారు, వాటి గురించి సరైన అవగాహన లేదని తెలిపారు. అలాంటి సమయంలో నాకు తెలిసిన ఒకే ఒక్క పేరు ప్రభాస్. ప్రభాస్ అన్న వల్లే నేను కూడా నటుడు అవ్వాలని, ప్రభాస్ అన్న సినిమాలే నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ యువ హీరో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉన్నారు. ఆహా లో వస్తున్న “ది బేకర్ అండ్ ది బ్యూటీ ” అనే వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది.