https://oktelugu.com/

Actress Mehreen: అభిమానులను నిరుత్సాహ పరుస్తున్న మెహ్రీన్…

Actress Mehreen: కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షక అభిమానులకు పరిచయం అయ్యారు మెహ్రీన్ కౌర్. ఈ మూవీతో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగింటి అమ్మాయిలా కనిపించే పాత్రలలో నటించి మెప్పించింది ఈ భామ. నార్త్ సైడ్ హీరోయిన్ అయినా కూడా… ఇప్పటి వరకు ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసిన సినిమాలు ఏమీ చేయలేదు అనే చెప్పాలి. ఇటీవలే మెహ్రీన్ ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 05:34 PM IST
    Follow us on

    Actress Mehreen: కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షక అభిమానులకు పరిచయం అయ్యారు మెహ్రీన్ కౌర్. ఈ మూవీతో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగింటి అమ్మాయిలా కనిపించే పాత్రలలో నటించి మెప్పించింది ఈ భామ. నార్త్ సైడ్ హీరోయిన్ అయినా కూడా… ఇప్పటి వరకు ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసిన సినిమాలు ఏమీ చేయలేదు అనే చెప్పాలి.

    ఇటీవలే మెహ్రీన్ ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారి నిశ్చితార్థం రద్దవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ భామ తన దృష్టిని సినిమాల వైపే పెట్టింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రానున్న దీపావళి కానుకగా ఈమె నటించిన “మంచి రోజులు వచ్చాయి” అనే చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో మెహరీన్ హాట్ గానే కనిపించడం విశేషం అని చెప్పుకోవచ్చు.

    కొంచెం బొద్దుగా ఉండే ఈ అమ్మడు సినిమా ఆఫర్స్ కోసం… ఇటీవల కాలంలో సన్నబడి హాట్ హాట్ ఫోటో షూట్ లతో అలరించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్-3’ లో నటిస్తున్నారు మెహరీన్. ఈ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందుతుంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లలోనూ మెహ్రీన్ కొంచెం ఎక్కువ గ్లామరస్‌ గానే కనిపిస్తోంది. కానీ ముద్దుగా ఉండే ఈ భామ ఈ మధ్య మరీ బక్క చిక్కడంతో అభిమానులు ఆమె కాస్త నిరుత్సాహ పడుతున్నారు అనే చెప్పుకోవాలి.