https://oktelugu.com/

MAA Elections: మోహన్ బాబు, నరేశ్ లను విలన్లు చేసే ప్రకాష్ రాజ్ వ్యూహం

MAA Elections: ‘మా’ ఎన్నికల వేడి అంత ఈజీగా చల్లారేలా కనిపించడం లేదు. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ పగతో రగిలిపోతున్నాడు. ఎలాగైనా సరే తనను ఓడించిన మంచు విష్ణు వర్గాన్ని.. ముఖ్యంగా ‘మా’ ఎన్నికల వేళ పోలింగ్ బూతుల్లో చెలరేగిపోయి ప్రకాష్ రాజ్ వర్గంపై బూతులతో తిట్టడం.. దాడులు చేసిన మోహన్ బాబు, నరేశ్ ల బండారాన్ని బయటపెట్టాలని ప్రకాష్ రాజ్ డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు కీలక స్టెప్ వేశాడు.] తాజాగా ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున […]

Written By: , Updated On : October 14, 2021 / 06:42 PM IST
Follow us on

MAA Elections: ‘మా’ ఎన్నికల వేడి అంత ఈజీగా చల్లారేలా కనిపించడం లేదు. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ పగతో రగిలిపోతున్నాడు. ఎలాగైనా సరే తనను ఓడించిన మంచు విష్ణు వర్గాన్ని.. ముఖ్యంగా ‘మా’ ఎన్నికల వేళ పోలింగ్ బూతుల్లో చెలరేగిపోయి ప్రకాష్ రాజ్ వర్గంపై బూతులతో తిట్టడం.. దాడులు చేసిన మోహన్ బాబు, నరేశ్ ల బండారాన్ని బయటపెట్టాలని ప్రకాష్ రాజ్ డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు కీలక స్టెప్ వేశాడు.]

తాజాగా ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున సీసీటీవీ ఫుటేజ్ ను ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ను ప్రకాష్ రాజ్ కోరుతూ లేఖ రాయడం సంచలనమైంది. తద్వారా మోహన్ బాబు, నరేశ్ లను మీడియా, ప్రజల ముందు విలన్లుగా చేసే ప్రయత్నాన్ని వేగవంతం చేశారు.

మా ఎన్నికలు నిర్వహించిన రోజు ఎన్నో భయంకర ఘటనలు జరిగాయని.. దానికి మీరే సాక్షి అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు లేఖలో ప్రకాష్ రాజ్ సూచించారు. మోహన్ బాబు, నరేశ్ ప్రవర్తన ఎలా ఉందో చూశామని.. కొందరు ‘మా’ సభ్యులపై వారు దాడి చేశారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే ‘మా’ సభ్యులు నిజం ఏంటో పోలింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పోలింగ్ సమయంలో సీసీ కెమెరాల రికార్డ్ చేసుకుంటారని భావిస్తున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు. దాన్ని మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నానని అన్నారు. మీరు వెంటనే స్పందించకపోతే అది డిలీట్ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ప్రకాష్ రాజ్ రాసిన లేఖపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ భద్రంగానే ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారం ఫుటేజ్ ను ఇస్తామన్నారు.

మరి మోహన్ బాబు, నరేశ్ చేసిన రచ్చ వీడియోలను ఎన్నికల అధికారి ఇస్తాడా? ఇస్తే వారి రచ్చ మీడియాలో రచ్చ రచ్చ కావడం ఖాయం. దీన్ని మంచు విష్ణు ప్యానెల్ ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే వారి పరువే పోతుంది.దీంతో ప్రకాష్ రాజ్ వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.