AP cabinet expansion: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో అందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలన్ని వెనక్కి తీసుకోవడం పరిపాటిగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చి రెండన్నరేళ్లు కావస్తున్న ఇంకా మంత్రివర్గ విస్తరణపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తంటాలు పడాల్సివస్తోంది. దీంతో జీవోలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సి వస్తోంది.
గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్నా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఫలితంగా మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న వారు ఎదురు చూస్తున్నారు. అధినేత ప్రాపకం పొందేందుకు తాపత్రయపడుతున్నారు. కానీ జగన్ మాత్రం మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి ధైర్యం చేయడం లేదు. విస్తరణ చేపడితే అనర్థాలు వస్తాయేమోననే ఉద్దేశంతోనే వాయిదా వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇన్నాళ్లు మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేస్తారని ప్రచారం సాగినా ఇప్పుడు మరో వాదన వినిపిస్తోంది. మంత్రివర్గంలో ఎనిమిది మందిని మాత్రమే తీసి మిగతా వారిని అలాగే ఉంచుతారని తెలుస్తోంది. దీంతో మంత్రి పదవి పొందాలనే ఉద్దేశంతోనే అధినేత చుట్టూ ప్రదక్షిణలు పెరిగాయి. ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. రాబోయే ఎ న్నికలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: AP 3 capitals: మళ్లీ 3 రాజధానుల బిల్లులు రెడీ చేస్తున్న జగన్.. ఆలోపే.. ఈసారి గట్టిగానే!
రాష్ర్టంలో వ్యతిరేక పరిస్థితులు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీలోని వారిలోనే అసంతృప్తి రాకుండా చూసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో ప్రజాభీష్టాన్ని గుర్తిస్తూ వారికి మేలు చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే దిశగా అందరు కష్టపడాలని సూచిస్తున్నారు.
Also Read: Papikondalu: పర్యాటకులు పాపికొండలకు వెళ్లడం లేదు.. కారణం అదేనా?