Anushka Sharma: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమపై రకరకాల పుకార్లు వచ్చినా చివరకు మాత్రం ఒక్కటయ్యారు. తరువాత వైవాహిక జీవితాన్ని కూడా ఎంజాయ్ చేశారు. సినిమాల్లో చేరి హీరోయిన్ గా చేసినా కోహ్లితో ప్రేమాయణం సాగించింది. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగి అది వివాహానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే వివాహం తరువాత కొంత కాలం నటనకు గ్యాప్ ఇచ్చినా తరువాత కొనసాగించింది. కానీ రెండున్నరేళ్ల క్రితం ఓ పాపకు జన్మనివ్వడంతో మొత్తానికి నటనకు విరామం చెప్పినట్లు అయింది. కానీ సామాజిక మాధ్యమాల్లో తన హవా కొనసాగిస్తూనే ఉంటోంది. ఎప్పుడు నెట్లో ఫొటోలు షేర్ చేస్తూ వారితో కబుర్లు చెబుతూనే ఉంటుంది.
ఇక విరాట్ కోహ్లి తన కెరీర్ ను సజావుగా కొనసాగించలేకపోతున్నాడు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెబుతాడనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. హీరోయిన్లు క్రికెటర్లను చేసుకోవడం కొత్తేమీ కాదు. అదే బాటలో జయప్రద కూడా నడిచినట్లు తెలిసిందే. సినిమా స్టార్లకు క్రికెటర్లకు అవినాభావ సంబంధం ఉందన్నట్లుగా వారి మధ్య సంబంధాలు బలపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో విరాట్ కోహ్లి అనుష్క శర్మల వివాహం కూడా చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.
అనుష్క శర్మ మొదట మోడలింగ్ తో ప్రారంభించి తరువాత సినిమాల్లో హీరోయిన్ గా రాణించి అనేక హిట్లు సొంతం చేసుకుంది. అదే సమయంలో విరాట్ తో ప్రేమాయణం కొనసాగించిది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తన కెరీర్ పరంగా ఎన్నో అవార్డులు సాధించింది. తరువాత ఆమె నిర్మాతగా మారింది. వెబ్ సిరీస్ ను నిర్వహిస్తోంది. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ జీవితాన్ని బయోపిక్ తీసేందుకు రెడీ అయిపోయింది. దీంతో నిర్మాతగా ఆమె మరిన్ని హిట్లు కొట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో హాట్ హాట్ గా ఉండటంతో ప్రేక్షకుల గుండెలు కంగారు పడుతున్నాయి. అనుష్క ఇంత దారుణమైన పిక్ లు పెడుతుందా అని ఆశ్చర్యపోతున్నారు. విరాట్ కోహ్లితో కలిసి బీచ్ లో అనుష్క చేసిన హంగామా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అనుష్క శర్మ చేసిన పనికి అందరు ఫిదా అయిపోతున్నారు. కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇంత దారుణమైన ఫొటోలు పెడుతున్న ఆమె తీరుకు అభిమానులు సందేహపడుతున్నారు. అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా ఇంతలా దిగజారిపోతోందని భయపడుతున్నారు. మొత్తానికి అనుష్క శర్మ ఇంకెన్ని అఘాయిత్యాలు చేస్తుందో తెలియడం లేదు.
Also Read:Mohanlal: మోహన్ లాల్ కి మూడేళ్ల జైలు శిక్ష.. కారణం ఏంటో తెలుసా?