Rahul Gandhi : రాహుల్ గాంధీ.. రోజురోజుకి లాఫింగ్ స్టార్ గా మారి నవ్వుల పాలవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలైన రాహుల్ గొడవ కొనసాగుతోంది. పాకిస్తాన్ కు వంతపాడుతూ భారత సైన్యాన్ని విమర్శిస్తున్నారు. బీజేపీని తిట్టిపోస్తున్నారు. ప్రతిపక్ష నేతగా భారత సైన్యం నైతికతను దెబ్బతీస్తున్నారు.
ప్రతీరోజు ఏదో ఒక వివాదాన్ని రాహుల్ రాజేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్టుగా దేశంలో పనిచేస్తోందని.. ఓటరు లిస్టులు మార్చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. ఈసీ ఎన్ని వివరణలు ఇచ్చినా రాహుల్ బుద్ధి మారడం లేదు.
రాహుల్ ఈరోజు కర్ణాటకలో ఏదో ఆటం బాంబు పేల్చుతాడట.. అన్నీ ఇప్పటివరకు పేల్చినవి తుస్సుమన్నాయి. ఇప్పుడు కొత్తగా పేల్చే ఆటంబాంబుపై ఎవరికీ అంచనాలు లేవు. ఏదో ఒక సంచలనం కోసం రాహుల్ ప్రతీరోజు ప్రయత్నిస్తున్నాడు.
ట్రంప్ విషయంలో మోడీ రాజీపడ్డాడని.. కాల్పుల విరమణకు అంగీకరించాడని రాహుల్ ఆరోపించాడు. యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందం జరుగబోతోందని రాహుల్ చెప్పుకొచ్చాడు. కానీ అది జరగలేదు. భారత్ పై ట్రంప్ టారిఫ్ లు విధించాడు. ట్రంప్ డెడ్ ఎకానమీ అనగానే.. దాన్ని రాహుల్ క్యాష్ చేసుకొని విమర్శిస్తున్నాడు. ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలంతా ఖండిస్తున్నా.. రాహుల్ సపోర్టు చేయడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
రాహుల్ గాంధీ నాయకత్వంపై సడలుతున్న విశ్వాసం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
