https://oktelugu.com/

Actor Nithin: వర్కౌట్ కాదన్నా నితిన్ ఆశ చంపుకోవట్లేదు !

Actor Nithin: నితిన్‌ మొదటి నుంచి మాస్ హీరో అవాలని చాలా తాపత్రయ పడ్డాడు. అయితే, నితిన్ పై మాస్ ఎలిమెంట్స్ వర్కౌట్ కావు, కాలేదు కూడా. మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలు చేసి కెరీర్ నే డౌన్ ఫాల్ చేసుకున్నాడు. అయితే, నితిన్ కి ల‌వ్ స్టోరీలు బాగా సెట్ అవుతాయి. పడిపోయిన ప్రతిసారి ఓ మంచి ప్రేమ కథతో పలకరించి మొత్తానికి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మళ్లీ ఎలాగోలా హీరోగా నిలబడ్డాడు. అలాగే నితిన్ ప్రధాన […]

Written By:
  • Shiva
  • , Updated On : January 4, 2022 / 02:59 PM IST
    Follow us on

    Actor Nithin: నితిన్‌ మొదటి నుంచి మాస్ హీరో అవాలని చాలా తాపత్రయ పడ్డాడు. అయితే, నితిన్ పై మాస్ ఎలిమెంట్స్ వర్కౌట్ కావు, కాలేదు కూడా. మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలు చేసి కెరీర్ నే డౌన్ ఫాల్ చేసుకున్నాడు. అయితే, నితిన్ కి ల‌వ్ స్టోరీలు బాగా సెట్ అవుతాయి. పడిపోయిన ప్రతిసారి ఓ మంచి ప్రేమ కథతో పలకరించి మొత్తానికి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మళ్లీ ఎలాగోలా హీరోగా నిలబడ్డాడు.

    Actor Nithin

    అలాగే నితిన్ ప్రధాన బలం ఫ‌న్ క్యారెక్ట‌ర్లు. కామెడీగా సరదాగా సాగే కుర్రాడి పాత్రలు కూడా నితిన్ పై బాగా పండుతాయి. గతంలో నితిన్ కి వచ్చిన హిట్ సినిమాల్ని ప‌రిశీలించినా ఈ విష‌యం అర్థం అవుతుంది. కాకపోతే, నితిన్ కి ఉన్న ఏకైక కోరిక.. మాస్ హీరో అవాలని, అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మాస్ సినిమా చేసి అందర్నీ మెప్పించాల‌ని గత కొన్నేళ్లుగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు.

    కానీ, నితిన్ చేసిన ప్ర‌య‌త్నాలేవీ మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. తన కోరిక నెర‌వేర‌లేదనే బాధ నితిన్ లో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే వచ్చింది. మరోపక్క నితిన్ కెరీర్‌ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే కామెడీ మూవీసే. ఇప్పటివరకు నితిన్ కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచిన భీష్మ‌ సినిమా కూడా ప‌క్కా ఎంట‌ర్‌టైన‌రే.

    Also Read: కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?

    ఇవ్వన్నీ తెలిసి కూడా నితిన్ మ‌ళ్లీ మాస్ సినిమాల పై ముచ్చట పడుతున్నాడు. మాస్ సినిమాల బాటలో పయనం మొదలుపెట్టాడు. వ‌క్కంతం వంశీతో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను ఠాగూర్ మ‌ధు నిర్మించబోతున్నాడు. ఈ సినిమా మాస్ జోన‌ర్ లో సాగబోతుంది. వ‌క్కంతం వంశీ యాక్ష‌న్ కి పెద్ద పీట వేశాడట.

    గతంలో కిక్‌, రేసుగుర్రం లాంటి సినిమాల‌కు వ‌క్కంతం వంశీ కథలు ఇచ్చాడు. ఆ శైలిలోనే నితిన్ తో ఓ భారీ ఎత్తున యాక్ష‌న్ డ్రామాను చేయాలని వ‌క్కంతం వంశీ ప్లాన్ చేసుకున్నాడు. పైగా వ‌క్కంతం వంశీ క‌థ‌ల్లో మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ప్ర‌స్తుతం హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఏది ఏమైనా వర్కౌట్ కాదు అని తెలిసినా నితిన్ మాత్రం ఆశ చంపుకోవట్లేదు.

    Also Read: రాంగోపాల్ వర్మ వరుస ప్రశ్నలు.. సమాధానం చెప్పే దమ్ము ఉందా?

    Tags