https://oktelugu.com/

Deepthi-Shanmukh Breakup: దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?

Deepthi-Shanmukh Breakup: ఇప్పుడు దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ బ్రేక‌ప్ వార్త ఎంత‌లా వైర‌ల్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బిగ్ బాస్‌లో ష‌ణ్ముఖ్, సిరి క్లోజ్ గా ఉన్న‌ప్ప‌టి నుంచే ఈ రెండు జంట‌లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ష‌ణ్ముఖ్ టైటిల్ గెలుస్తాడ‌నుకుంటే… ర‌న్న‌ర్ గా మిగిలాడు. అయితే బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే దీప్తి సునైనా ష‌ణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ వార్తి ఇప్పుడు వారి అభిమానుల‌కు తీవ్ర […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 4, 2022 / 01:50 PM IST
    Follow us on

    Deepthi-Shanmukh Breakup: ఇప్పుడు దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ బ్రేక‌ప్ వార్త ఎంత‌లా వైర‌ల్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బిగ్ బాస్‌లో ష‌ణ్ముఖ్, సిరి క్లోజ్ గా ఉన్న‌ప్ప‌టి నుంచే ఈ రెండు జంట‌లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ష‌ణ్ముఖ్ టైటిల్ గెలుస్తాడ‌నుకుంటే… ర‌న్న‌ర్ గా మిగిలాడు. అయితే బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే దీప్తి సునైనా ష‌ణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ వార్తి ఇప్పుడు వారి అభిమానుల‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది.

    Deepthi-Shanmukh Breakup

    ఇక‌పోతే వీరి బాట‌లోనే సిరి హ‌న్మంతు, ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా వెళ్తున్న‌ట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ కు ముందు నుంచి ఐదేండ్లుగా ష‌ణ్ముఖ్, దీప్తి ల‌వ్ లో ఉన్నారు. ష‌ణ్ముఖ్ హౌస్ లో ఉండ‌గా.. దీప్తి ఎంతో స‌పోర్టు చేసింది. అంత సపోర్టు చేసి హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే బ్రేక‌ప్ చెప్పేసింది. అంటే హౌస్ లో సిరితో ష‌ణ్ముఖ్ క్లోజ్ గా మూవ్ అవ్వ‌డాన్ని ఆమె త‌ట్టుకోలేక‌పోయింద‌ని వార్తలు వ‌స్తున్నాయి.

    Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లో దీప్తి కన్నీళ్లు.. వైరల్

    సిరి కార‌ణంగానే దీప్తి బ్రేక‌ప్ చెప్పింద‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సిరికి ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా బ్రేకప్ చెప్పబోతున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి హౌస్‌లో సిరి, షణ్ముఖ్ ఫ్రెండ్స్ గానే కాకుండా ఎమోష‌న‌ల్ గా రిలేష‌న్ పెంచుకున్నార‌ని తెలుస్తోంది. కాగా వీరి బంధంపై ఇరువురు క్లారిటీ ఇస్తూ.. తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా.. రూమర్స్ ఆగట్లేదు.

    ఇక శ్రీహాన్ సోష‌ల్ మీడియాలో సిరితో దిగిన కొన్ని ఫొటోల‌ను కూడా తొల‌గించాడ‌ని తెలుస్తోంది. అంటే ష‌ణ్ముఖ్ తో సిరి రిలేష‌న్ పెంచుకోవ‌డాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేద‌ని, అందులో సిరిని క‌ల‌వ‌ట్లేద‌ని తెలుస్తోంది. చూస్తుంటే రేపో మాపో వీరు కూడా బ్రేక‌ప్ చెప్పుకుంటారేమో అనిపిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ షో రెండు జంట‌ల న‌డుమ చిచ్చు పెట్టింద‌ని వారి అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. మ‌రి శ్రీహాన్ ఏం చేస్తాడో చూడాలి.

    Also Read: చక్కటి ప్రేమాయణంలో ‘బిగ్ బాస్’ చిచ్చు.. అక్కడే షణ్ముక్, దీప్తి రిలేషన్‌కు బ్రేకులు..!

    Tags