https://oktelugu.com/

Jagan Govt: జగనూ అలా చేస్తే నిర్మాతలకు డబ్బు మీకు ఓట్లు వస్తాయి !

Jagan Govt: జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల అంశం పై చేస్తున్న రాద్దాంతం పై గత కొన్ని రోజులుగా సర్వత్రా చర్చ జరుగుతూనే ఉంది. టికెట్ల ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం పై ఇప్పటికే పలుమార్లు స్పందించిన ఆర్జీవీ.. తాజాగా ట్విటర్‌ వేదికగా కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధిస్తూ తనకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇంతకీ వర్మ అడిగిన ప్రశ్నలు ఏమిటంటే.. సినిమా అయినా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 4, 2022 / 03:14 PM IST
    Follow us on

    Jagan Govt: జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల అంశం పై చేస్తున్న రాద్దాంతం పై గత కొన్ని రోజులుగా సర్వత్రా చర్చ జరుగుతూనే ఉంది. టికెట్ల ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం పై ఇప్పటికే పలుమార్లు స్పందించిన ఆర్జీవీ.. తాజాగా ట్విటర్‌ వేదికగా కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధిస్తూ తనకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇంతకీ వర్మ అడిగిన ప్రశ్నలు ఏమిటంటే..

    CM Jagan

    సినిమా అయినా కావొచ్చు, మరొకటి అయినా కావచ్చు, అసలు ఏదైనా వస్తువు యొక్క మార్కెట్‌ ధర నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్ర ఎంత ఉండాలి ? ఎంతమేరకు ప్రభుత్వం హక్కు ఉంటుంది?

    వంటనూనె, గోధుమలు, బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువుల కొరత వచ్చిన సమయంలో.. ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయి. వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ధరలను నిర్ణయించాలి, నిర్ణయిస్తాయని తెలుసు. కానీ, అది సినిమాలకు ఎందుకు వర్తిస్తుంది ? ఎలా వర్తిస్తుంది ? అసలు సినిమా టికెట్ల ధరను ప్రభుత్వమే నిర్ణయించే విధంగా దారి తీసిన పరిస్థితులు ఏమున్నాయి ?

    ఒకవేళ పేదలకు సినిమా అనేది చాలా అవసరం అని మీరు అనుకుంటే.. విద్యా, వైద్యసేవలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. మరి అలాగే సినిమాలకు కూడా రాయితీ ఎందుకు ఇవ్వరు ?

    Also Read: అమరావతి ఉద్యమానికి చెక్ చెప్పే జగన్ కొత్త వ్యూహం

    అదే విధంగా పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్‌ షాపులు ఉన్నాయి. అలాగే రేషన్‌ థియేటర్ల ఏర్పాటును చేసి ప్రేక్షకులకు కూడా సినిమాలను ఉచితంగా అందించే ఆలోచనలు ఏమైనా చేస్తారా? అంటూ ఇలా ఆర్జీవీ తనదైన అనేక పదునైన ప్రశ్నలను వదలి తనకు సమాధానం చెప్పాలని కోరాడు.

    పైగా ఆర్జీవీ చేసిన మరో ట్వీట్ కూడా చాలా ఆలోచించే విధంగా ఉంది. ‘ఆహారధాన్యాల ధరలను బలవంతంగా తగ్గించారు అనుకుందాం. అప్పుడు రైతుల కష్టానికి ప్రతిఫలం లభించదు. కచ్చితంగా అప్పటి నుంచి పంట నాణ్యతలో లోపం వస్తోంది. అదే సిద్ధాంతం సినిమాలకు వర్తిస్తుంది. అందుకే నిర్మాతలు వాళ్లకు నచ్చిన ధరకు టికెట్లను అమ్ముతారు. ప్రభుత్వం కొన్ని కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇవ్వండి. అప్పుడు నిర్మాతలకు డబ్బు.. మీకు ఓట్లు వస్తాయి’’ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.

    Also Read: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై అందరిలో ఉత్కంఠ?

    Tags