Actor Nassar: నాజర్ కష్టాలు: చిరంజీవి పిలిచినా ఆత్మాభిమానం అడ్డొచ్చి వెళ్ళలేదు, హోటల్ లో వెయిటర్ గా చేశా…

Actor Nassar: ఒకప్పటి తన కష్టాలను నాజర్ గుర్తు చేసుకున్నారు. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పూర్తి అయ్యాక నాజర్ కి అవకాశాలు రాలేదట. చిన్న చిన్న పాత్రలు వచ్చేవట.

Written By: S Reddy, Updated On : July 2, 2024 12:28 pm

Actor Nassar About His Job as a Waiter in a Hotel

Follow us on

Actor Nassar: నాజర్ అత్యంత బిజీ ఆర్టిస్ట్. విలన్, క్యారెక్టర్, కామెడీ… రోల్ ఏదైనా జీవించేస్తారు. తమిళ నటుడైన నాజర్ తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో చిత్రాలు చేశారు. కొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించారు. అత్యధికంగా తమిళ్, తెలుగు చిత్రాల్లో విలక్షణ పాత్రలు చేశారు. ఏడాదికి 20కి పైగా చిత్రాల్లో నాజర్ నటిస్తున్నారు. కానీ కెరీర్ తొలినాళ్ళలో నాజర్ అనేక కష్టాలు పడ్డారట. ఒక దశలో నటనకు గుడ్ బై చెప్పేసి స్టార్ హోటల్ లో వెయిటర్ గా జాయిన్ అయ్యాడట.

ఒకప్పటి తన కష్టాలను నాజర్ గుర్తు చేసుకున్నారు. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పూర్తి అయ్యాక నాజర్ కి అవకాశాలు రాలేదట. చిన్న చిన్న పాత్రలు వచ్చేవట. తన ఇంటి నుండి రోజు సైకిల్ మీద 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న షూటింగ్ స్పాట్ కి వచ్చేవాడట. నాజర్ అమ్మగారు పొద్దున్నే అన్నం వండి క్యారేజీ కట్టి ఇచ్చేదట. ఒక్కోరోజు కూర లేకుండా కేవలం అన్నం తీసుకుని వచ్చేవాడట. చిరంజీవితో పాటు మరికొందరు నటులకు ఆంధ్రా హోటల్ నుండి భోజనాలు వచ్చేవట. వాళ్ళు ఏమైనా కూరలు, సాంబార్ ఇస్తారేమో అని నాజర్ ఎదురు చూసేవాడట.

ఒక రోజు చిరంజీవి… నాజర్ అన్నం వండమని పొద్దున్నే అమ్మను ఇబ్బంది పెట్టొద్దు. మేము ఏడుగురం ఉన్నాం. మాతో పాటు నువ్వు కూడా భోజనం చేయ్ అని అన్నారట. ఆ షూటింగ్ పూర్తి అయ్యే వరకు చిరంజీవితో పాటు నాజర్ భోజనం చేశాడట. చిన్న చిన్న వేషాలతో విసిగిపోయిన నాజర్ తాజ్ కోరమండల్ హోటల్ లో వెయిటర్ గా చేరాడట. తాజ్ కోరమండల్ హోటల్ కి ఫిల్మ్ ఛాంబర్ ఒక కిలో మీటర్ దూరంలో ఉండేదట. చిరంజీవి షూటింగ్ ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతుంటే నాజర్ హోటల్ దగ్గర నుండి నడుచుకుంటూ అక్కడకు వెళ్ళాడట.

నాజర్ షూటింగ్ స్పాట్ కి వచ్చాడని గమనించిన చిరంజీవి తనని పిలిపించాడట. ఏం చేస్తున్నావని అడిగాడట. హోటల్ లో వెయిటర్ గా చేరానని నాజర్ చెప్పాడట. అంత మంచి నటుడివి హోటల్ లో వెయిటర్ గా చేయడం ఏమిటీ… నన్ను కలువు అని చిరంజీవి అన్నాడట. ఆత్మాభిమానం అడ్డొచ్చి నాజర్ చిరంజీవిని కలవలేదట. అనంతరం చిరంజీవి పెద్ద స్టార్ అయ్యాడట.బాలచందర్ చిత్రాల్లో మంచి పాత్రలు చేసి నాజర్ కూడా నటుడిగా స్థిరపడ్డాడట. చిరంజీవితో నటించే అవకాశం పెద్దగా రాలేదు. ఖైదీ 150లో చిన్న పాత్ర అయినా కూడా చిరంజీవి కోసం చేశానని.. నాజర్ అన్నారు.