https://oktelugu.com/

Kalki 2: కల్కి 2 కోసం రాజమౌళి ఆస్థాన టెక్నీషియన్… అతను ఫెయిల్ అయ్యాడా?

Kalki 2: ఇండియాలో కంటే విదేశాల్లో కల్కి చిత్రానికి ఎక్కువ రెస్పాన్స్ దక్కుతుంది. కల్కి హాలీవుడ్ తరహా చిత్రం కావడం ఇందుకు కారణం. దర్శకుడు నాగ్ అశ్విన్ అంతర్జాతీయ స్థాయి చిత్రం తెరకెక్కించాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 2, 2024 12:19 pm

    Kalki 2 Music Director Changed

    Follow us on

    Kalki 2: ప్రభాస్ కి చాలా కాలం తర్వాత క్లీన్ హిట్ పడింది. కల్కి 2829 AD వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ కల్కి రూ. 600 కోట్ల వసూల్ మార్క్ చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. యూఎస్ లో ఏకంగా $12 మిలియన్ వసూళ్లను అందుకుంది. వేగంగా అక్కడ రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కల్కి రికార్డులకు ఎక్కింది. హిందీ వెర్షన్ సైతం వంద కోట్ల వసూళ్లను అధిగమించింది. కల్కి జోరు చూస్తుంటే రూ. 1000 కోట్ల వసూళ్లను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

    ఇండియాలో కంటే విదేశాల్లో కల్కి చిత్రానికి ఎక్కువ రెస్పాన్స్ దక్కుతుంది. కల్కి హాలీవుడ్ తరహా చిత్రం కావడం ఇందుకు కారణం. దర్శకుడు నాగ్ అశ్విన్ అంతర్జాతీయ స్థాయి చిత్రం తెరకెక్కించాడు. ఇండియన్ డైరెక్టర్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. కల్కి చిత్రంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఒక్క చిత్రంతో ఆయన ఫేమ్ ఎక్కడికో వెళ్ళింది.

    బౌంటీ హంటర్ గా ప్రభాస్ నటనకు మార్కులు పడుతున్నాయి. సెల్ఫిష్, క్యాజువల్ గయ్ పాత్రలో ప్రభాస్ అలరించాడు. కల్కి చిత్రానికి అమితాబ్ పాత్ర ప్రధాన బలంగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ అశ్వద్ధామగా అమితాబ్ రోల్ ని చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దాడు. ప్రభాస్-అమితాబ్ మీద తెరకెక్కిన యాక్షన్ ఎపిసోడ్స్ ఐ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. కథ, కథనం, విజువల్స్ అబ్బురపరిచాయి.

    అయితే సంతోష్ నారాయణ్ మ్యూజిక్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. బీజీఎమ్ పర్లేదు. సాంగ్స్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో కల్కి 2 కోసం మరొక మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దించుతున్నారట. రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి కల్కి 2 కి మ్యూజిక్ ఇస్తున్నాడంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. అయితే కీరవాణి రాజమౌళి చిత్రాలకు మాత్రమే గొప్ప మ్యూజిక్ ఇస్తాడు. మిగతా దర్శకుల చిత్రాల విషయంలో ఆయన సంగీతం ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ మరొక బెస్ట్ ఆప్షన్ చూస్తే మంచిది..