https://oktelugu.com/

Actor Naresh Son Naveen : పవిత్రతో ఎఫైర్ పై నోరు విప్పిన నరేష్ కొడుకు నవీన్… తప్పులు జరిగాయంటూ!

ఇక ఐదేళ్లకు పైగా పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఇద్దరూ జంటగా మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఒక సినిమా చేశారు. ఇది నరేష్ బయోపిక్ గా తెరకెక్కింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2023 / 03:36 PM IST
    Follow us on

    Actor Naresh Son Naveen: నటుడు నరేష్ కి పెళ్లీడుకు వచ్చిన కొడుకు ఉన్నాడు. మొదటి భార్య కుమారుడైన నవీన్ విజయ్ కృష్ణ పరిశ్రమలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. నరేశ్-నవీన్ పెద్దగా కలిసి కనిపించరు. వారి మధ్య అనుబంధం అంతంత మాత్రమే అనిపిస్తుంది. నవీన్ హీరోగా ఒకటి రెండు చిత్రాలు చేశారు. అవి సక్సెస్ కాలేదు. ఇటీవల దర్శకుడిగా మారి సత్య అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. సత్యలో హీరో సాయి ధరమ్ తేజ్ నటించడం విశేషం. సత్య షార్ట్ ఫిల్మ్ ని బాగానే ప్రమోట్ చేశారు.

    సత్య ప్రమోషనల్ ఈవెంట్లో నవీన్ ఎమోషనల్ అయ్యాడు. జీవితంలో దారుణమైన దశ చూసినట్లు వెల్లడించాడు. తాజాగా నవీన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మొదటిసారి తండ్రి నరేష్, పవిత్రల బంధం గురించి ఓపెన్ అయ్యాడు. చెప్పాలంటే నరేష్ నిర్ణయాన్ని అతడు సమర్ధించాడు. నవీన్ మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటారు. ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తారు. ఎవరి మీదా ఆధారపడరు. దీని వలన కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఎవరినీ నేను తప్పుబట్టను.

    మా ఫ్యామిలీ గురించి కొందరు చెడుగా మాట్లాడినా నేను పట్టించుకోలేదు. జనాలకు నచ్చినట్లు మనం బ్రతకలేం కదా. మా నాన్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఆయన సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. ఎవరేమనుకున్నా నాన్న తన పని తాను చేసుకుపోతారు. ఆయనలోని మంచి లక్షణం అది. మనం కూడా నేర్చుకోవాలి. పవిత్ర మంచి వ్యక్తి. నాకు చాలా కాలంగా తెలుసు. అప్పుడప్పుడు నాతో మాట్లాడతారు. నేనేదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బెస్ట్ విషెస్ చెబుతారు. నేను ఆమెను పవిత్ర గారు అని పిలుస్తాను… అని నవీన్ చెప్పుకొచ్చాడు.

    నరేష్ మూడు వివాహాలు చేసుకోగా మూడో భార్య రమ్య రఘుపతితో విబేధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల నరేష్ కి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. రమ్య రఘుపతి నరేష్ ఇంట్లోకి ప్రవేశించరాదని ఆదేశించింది. ఇక ఐదేళ్లకు పైగా పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఇద్దరూ జంటగా మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఒక సినిమా చేశారు. ఇది నరేష్ బయోపిక్ గా తెరకెక్కింది.