Electric Scooter: ప్రతీ 90 సెకన్లకు ఒక స్కూటర్ విక్రయం.. దూసుకుపోతున్న ఈ కంపెనీ సేల్స్

ఏథర్ కంపెనీ నుంచి 450 ఎక్స్, 450 ప్లస్ విద్యుత్ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. 2018లో 450 స్కూటర్ ను రిలీజ్ చేశారు.

Written By: Srinivas, Updated On : August 23, 2023 3:26 pm
Follow us on

Electric Scooter: రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా సాగనుంది. ఇప్పటికే బజాజ్, టీవీఎస్ కంపెనీలు విద్యుత్ స్కూటర్లను అందుబాటులోకి తెచ్చి ఆకట్టుకుంటున్నాయి. వీటికి ఏథర్ ఈయూ అమ్మకాల్లో దూసుకుపోతుంది. 2022 మే నెల నుంచి విక్రయాలు ప్రారంభించిన ఇవి మొదట్లో నెలకు 200 యూనిట్లు మాత్రమే విక్రయించారు. కానీ ఇప్పుడు ప్రతీ నెల 15,000 యూనిట్లు అమ్ముడు పోతున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ప్రతీ 90 సెకన్లకు ఒక స్కూటర్ ను విక్రయిస్తున్నట్లు కంపెనీ సీఈవో తరుణ్ మెహతా వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..

ఏథర్ కంపెనీ నుంచి 450 ఎక్స్, 450 ప్లస్ విద్యుత్ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. 2018లో 450 స్కూటర్ ను రిలీజ్ చేశారు. 2.4 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాకప్ ను కలిగిన దీనికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎకో మోడ్లో 75 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అదే స్పోర్ట్ మోడ్ లో 55 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని ప్రారంభ ధర రూ.1.13 లక్షలు ఉంది. అయితే దీనికి పూర్తిగా ఛార్జింగ్ ఎక్కాలంటే 5 గంటల 30 నిమిషాలు పడుతుంది.

ఏథర్ 450 ఎక్స్ రిలీజైన కొద్దీరోజుల్లోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. 450 మోడల్ తో పోల్చితే 450 ఎక్స్ మంచి విక్రయాలు సొంతం చేసుకుంది. ఇది 6 కిలో వాట్ల పవర్, 26 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కేడబ్ల్యూహెచ్ సామర్థ్య బ్యాటరీని పెట్టారు. దీంతో ఒక్కసారి చార్జింగ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. స్టాండార్డ్ 450 కంటే 10 కిలోమీటర్ల అధికం. దీని ప్రారంభ ధర రూ.1.49 లక్షలు ఉంది.

కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏథర్ ఎనర్జీ రెండు మోడళ్లు కలిపి 2022 ఏప్రిల్ లో 3, 779 యూనిట్లను విక్రయించారు. దీంతో కేవలం 0.21 వృద్ధిని మాత్రమే సాధించి నిరాశ పరిచింది. అయితే ఈ ఏడాదిలో మాత్రం దూసుకుపోతుంది. ప్రతీ 90 సెకన్లకు ఒక స్కూటర్ అమ్ముడు పోతుందని కంపెనీ సీఈవో మెహతా తెలిపారు. ఇవి 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం బెంగుళూరులోని ప్రతీ వీధిలో కనిపించేలా ఉత్పత్తి చేస్తామని, ఆ తరువాత ఢిల్లీ రోడ్లపై తిప్పుతామని ఆయన చెబుతున్నారు.