Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో గురువారం తొలి ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో మోహన్ బాబు తొలి గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలయ్య అడిగిన ప్రశ్నలకు మోహన్‌బాబు తనదైన స్టైల్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతే కాదు, బాలకృష్ణకు మోహన్‌బాబు ఎదురు ప్రశ్నలు సంధించి సమాధానాలూ రాబట్టారు. ఇలా ఎంతో రసవత్తరంగా మారిన ఆ విశేషాలేంటో చూద్దాం.
షోలో భాగంగా చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటని బాలయ్య ఆడగ్గా.. అతను చాలా మంచి నటుడని, అద్భతంగా డాన్స్ చేస్తాడని మోహన్‌బాబు అన్నారు. వ్యక్తిగతంగా చిరుపై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని అన్నారు. ఆయనతోకలిసి ఎన్నో సినిమాల్లో నటించినట్లు పేర్కొన్నారు. చిరంజీవి భార్య సురేఖ తనకు సోదరిలాంటిదని మోహన్ బాబు అన్నారు.
కాగా, మీరు నటించిన సినిమాల్లో అసలు చూసుకోలేని సినిమా ఏదైనా ఉందా అని బాలకృష్ణ అడగ్గా.. పటాలం పాండు చేసినప్పుడు తన భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదని అన్నారు. తన బ్యానర్లో వరుసగా 5సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. మహాబలిపురంలోని భూములు అమ్మి అందరికీ అప్పులు చెల్లించినట్లు తెలిపారు. ఒకానొక సమయంలో సర్గీయ ఎన్టీఆర్‌ని అన్నయ్యా మీతో కలిసి సినిమా చేస్తా అని అడిగినప్పుడు.. రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను. నా సినిమాలు ఎవరు చూస్తారు. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు అని సలహా ఇచ్చిన గొప్ప మనిషి ఎన్టీఆర్ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.