Nandamuri BalaKrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ మరో కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అనే ప్రొగ్రామ్‌కు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ ప్రొగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ ను ప్రసారం చేయనున్నారు. అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆయన్ను చాలామంది ఇంటర్వ్యూ చేశారు. ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే… ఆయన సెలబ్రిటీలను ఎలా ఇంటర్వ్యూ చేస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు పాల్గొన్నారు. బాలకృష్ణ యాంకరింగ్ తో అదరగొట్టారని చెప్పాలి. రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం ఆ పగ్గాలు మీరు చేతిలోకి తీసుకోకుండా… చంద్రబాబుకు ఎందుకిచ్చావ్ అని బాలకృష్ణను మోహన్ బాబు ప్రశ్నించారు.
అయితే ఇప్పుడు తదుపరి ఎపిసోడ్ లకు వచ్చే గెస్ట్ లు ఎవరా అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ మేరకు ఆహా టీమ్ కూడా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అతిథులు లిస్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. రెండవ ఎపిసోడ్ కు రానా, ఆ తర్వాత నాని గెస్ట్ లుగా వచ్చారని సమాచారం. ఈ రెండు ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎపిసోడ్ల కోసం జూనియర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట అల్లు అరవింద్. ముఖ్యంగా యంగ్ టైగర్ గెస్ట్ గా , బాలయ్య హోస్ట్ అనే విషయం ఊహించుకుంటేనే నందమూరి అభిమానులకు ఓ రేంజ్ లో పూనకాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bala krishna unstopable talk show guest list viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com