https://oktelugu.com/

Venu Swamy Wife: వేణు స్వామి కోసం రంగంలోకి దిగిన భార్య..ఈ రేంజ్ లో రెచ్చిపోయింది ఏంటి!

రీసెంట్ గా ఆయన నాగ చైతన్య - శోభిత నిశ్చితార్థం పై కూడా కామెంట్ చేస్తూ,వీళ్లిద్దరు 2027 లో ఒక స్త్రీ కారణంగా విడిపోతారు అని చెప్పాడు. ఇక నెటిజెన్స్ వేసెను స్వామి ని ఒక రేంజ్ లో ఏకిపారేశారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 05:01 PM IST
    Venu Swamy Wife

    Venu Swamy Wife

    Follow us on

    Venu Swamy Wife: సెలెబ్రిటీల జాతకాలను చెప్తూ సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో ఉండే వేణు స్వామి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయనని తిట్టని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఇతను సెలెబ్రెటీలకు సంబంధించి నెగటివ్ గా జాతకాలు చెప్తూ ఉంటారు. అప్పుడే పుట్టిన రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా జాతకం కూడా చెప్తూ, ఆమె జాతకం రీత్యా భవిష్యత్తులో ఆ పాపకి ఆరోగ్యం బాగుండదు అంటూ మాట్లాడిన ఘన చరిత్ర ఆయనది. అలాగే ఈ ఎన్నికలలో వైసీపీ పార్టీ అఖండ మెజారిటీ తో గెలిచి జగన్ రెండవసారి సీఎం అవ్వబోతున్నారు అంటూ సవాళ్లు విసిరిన వేణు స్వామి అది జరగకపొయ్యేసరికి ఇంకెప్పుడు సెలెబ్రిటీల జాతకాలు చెప్పను అంటూ ఒక వీడియో విడుదల చేసాడు.

    సరే అక్కడి వరకు బాగుంది అనుకుందాం, కానీ రీసెంట్ గా ఆయన నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం పై కూడా కామెంట్ చేస్తూ,వీళ్లిద్దరు 2027 లో ఒక స్త్రీ కారణంగా విడిపోతారు అని చెప్పాడు. ఇక నెటిజెన్స్ వేసెను స్వామి ని ఒక రేంజ్ లో ఏకిపారేశారు. దానికి ఆయన సమాధానం చెప్తూ, ఇక నుండి నేను సెలెబ్రెటీలకు జాతకాలు చెప్పను, నాగ చైతన్య కి కొనసాగింపుగా మాత్రమే చెప్పాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. మీడియా కూడా వేణు స్వామి పై చాలా తీవ్రంగా విరుచుకుపడింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ గా వేణు స్వామి సతీమణి వీణ ఆయనకీ సపోర్టుగా మీడియా ముందుకు వచ్చింది. వీణ ఒక సంగీత కళాకారిణి గా మంచి పేరు సంపాదించుకుంది. ఎన్నో వేల ఈవెంట్స్ లో ఆమె సంగీతం వాయించింది. అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె ఇచ్చిన లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మన్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈమెపై ఆడియన్స్ లో చాలా మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఈరోజు ఆమె తన భర్త కి సపోర్టుగా మీడియా మీద రెచ్చిపోతూ కాసేపటి క్రితమే విడుదల చేసిన వీడియో ని చూసి ఆడియన్స్ షాక్ కి గురయ్యారు.

    ఆమె మాట్లాడుతూ ‘పనికిమాలిన విషయాల మీద గంటలతరబడి లైవ్ డిబేట్స్ చేసే మీడియా ఈరోజు నా భర్త మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం చూస్తుంటే నవ్వు వస్తుంది. నిన్న మొన్నటి వరకు రాజ్ తరుణ్, లావణ్య వ్యక్తిగత విషయం లోకి దూరి డిబేట్స్ చేసిన మీకు, నా భర్త ని కామెంట్ చేసే హక్కు ఏముంది?, ఎప్పుడైనా ఉపయోగపడే వాటి మీద లైవ్ డిబేట్స్ చేసారా?, బాంగ్లాదేశ్ లో అంత విద్వంసం జరుగుతుంది కదా, దాని మీద ఎవరైనా ఎన్ని డిబేట్స్ చేసారు, ఏమాత్రం పత్రికా విలువలు పాటించని ఒక మీడియా అధినేత నా భర్త గురించి మాట్లాడడం హాస్యాస్పదం’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.