Homeఎంటర్టైన్మెంట్Actor Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ కు మరో అరుదైన గౌరవం...

Actor Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ కు మరో అరుదైన గౌరవం…

Actor Dhanush: సినిమా సినిమాకు తనలోని నటనకు మెరుగుపరుచుకుంటూ వెళుతున్నాడు తమిళ హీరో ధనుష్‌. వైవిధ్య భరితమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడీ యంగ్‌ హీరో. కేవలం ఇండియన్‌ సినిమాలకే పరిమితం కాకుండా హాలీవుడ్‌ లోనూ నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ధనుష్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. ధనుష్‌ తెలుగు డబ్బింగ్‌ సినిమాలు టాలీవుడ్‌లోనూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు ధనుష్ ను మరో అవార్డ్ వరించింది.

actor dhanush got best actor award in brics film festival for asuran movie

గోవాలోని పనాజీలో జరుగుతున్న 52 వ ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్ లో ఈ అవార్డును ప్రకటించారు. బ్రిక్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లో ఉత్తమ నటుడిగా ధనుష్ కు ఈ అవార్డు వరించింది. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంతో రూపొందించిన ’అసురన్‘ సినిమాలో చేసిన ఫర్ఫామెన్స్ కు గానూ ధనుష్ కు ఎంపికయ్యాడు. ఇదే చిత్రానికి ధనుష్ జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. బ్రెజిలియన్ చిత్రం ‘ఆన్ వీల్స్’లో తన నటనకు లారా బోల్డోరిని ఫెస్టివల్‌లో ఉత్తమ నటి (మహిళ) అవార్డును అందుకుంది. ఉత్తమ చిత్రం అవార్డును దక్షిణాఫ్రికా చిత్రం ‘బరకత్’, రష్యన్ చిత్రం ‘ది సన్ అబౌ మీ నెవర్ సెట్స్’ అనే రెండు చిత్రాలు పంచుకున్నాయి. ఇఫ్ఫీ తో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే తొలిసారి. బ్రిక్స్ ఫెస్టివల్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా సినిమాలు పాల్గొన్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version