Actor Chiranjeevi : డిజిటల్ మీడియా ఫెడరేషన్ కు సంభందించిన ఒక ఈవెంట్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఇక దీనికి మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ లు హాజరవ్వడం విశేషం…ఇక అందులో భాగంగానే విజయ్ దేవరకొండ చిరంజీవితో ఒక చిన్న ఇంటర్వ్యూ ని కూడా ప్లాన్ చేసి ఆయన కెరియర్ కు సంబంధించిన చాలా విషయాలను అడుగుతూ ఆయన ద్వారా వాటికి ఆన్సర్స్ ని చెప్పించే ప్రయత్నం చేశాడు…
ఇక అందులో భాగంగానే ‘పద్మ విభూషణ్’ అవార్డు ఇండియాలో చాలా తక్కువ మందికి వచ్చింది. మీకు రావడం పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు.?ఆ అవార్డు మీకు వస్తుందని మీరు ముందే ఊహించారా..?
విజయ్ అడిగిన ప్రశ్న కి చిరంజీవి సమాధానం చెబుతూ నేను చిన్నప్పుడు స్కూల్లో నాటకాలు వేస్తున్నప్పుడు అందరూ నన్ను చాలా ప్రత్యేకంగా చూసేవారు. నా గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇక వాళ్లు అలా మాట్లాడుతున్న ప్రతిక్షణం నేను స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూ ఉండేవాడిని, ఇక అందులో భాగంగానే నేను మంచి నటుడిని అవ్వాలనే ఉద్దేశ్యం తోనే ఇండస్ట్రీకి వచ్చాను. అలాగే ఒక నటుడిగా నేను ఎదిగిన తర్వాత నా గురించి అందరూ ఎలా మాట్లాడుకుంటారు అనేది కూడా నేను ముందే ఇమాజినేషన్ చేసుకుంటే ఉండేవాడిని..ఇక ఆ స్థాయికి మనం వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడి మరి నన్ను నేను మెగాస్టార్ గా తీర్చిదిద్దుకున్నాను అంటూ సమాధానం చెప్పాడు…
సినిమాల్లోకి వెళ్తాను అని చెబితే మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియక్ట్ అయ్యారు..?
ఈ ప్రశ్నకి చిరంజీవి సమాధానం చెబుతూ మా నాన్నగారికి కూడా సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అందువల్లే నేను సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పడంతో ఆయన ఏ మాత్రం అబ్జెక్షన్ చెప్పలేదు. ఇక నా కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత నేను సినిమా రంగం వైపు అడుగులు వేశాను… ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఇలా కొనసాగుతూ వస్తున్నానని చెప్పాడు…
మీకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది…
నాకు మొదటి సినిమా అవకాశం రావడానికి నేను పెద్దగా కష్టపడలేదు. నా ఫ్రెండ్ అయిన సుధాకర్ ‘ పునాది రాళ్ళు’ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం సెలెక్ట్ అయ్యాడు. కానీ అంతకుముందే భూపతి రాజా గారి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అది మంచి క్యారెక్టర్ అవ్వడం వల్ల ఆ క్యారెక్టర్ చేయాలంటే ఈ క్యారెక్టర్ ను వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో సుధాకర్ ఈ క్యారెక్టర్ ని వదిలేయాలి అనుకున్నాడు. కానీ సుధాకర్ నేను ఈ సినిమా చేయను అని డైరెక్టర్ తో ఎలా చెప్పాలి అని సతమతమవుతుంటే నేను సుధాకర్ ప్రాబ్లం ను అర్థం చేసుకొని తీసుకెళ్లి మావాడు ఈ క్యారెక్టర్ లో చేయడు అని కరాకండిగా చెప్పేశాను. దానివల్ల వాళ్లకు నా అగ్రెసివ్ నెస్ నచ్చింది. దాంతో సుధాకర్ క్యారెక్టర్ నన్ను చేయమని అడిగారు. నేను అప్పటికే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నాను కాబట్టి అది అయిపోయిన తర్వాత చేస్తాను అని చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు ఇక మొత్తానికైతే నా కోచింగ్ పూర్తవ్వక ముందే నా చేత సినిమాల్లో నటింపజేశారు. ఇక అప్పటినుంచి నాకు వరుసగా ఆఫర్లు వస్తూ ఉండేవి..
మీరు ఇండస్ట్రీలో ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు..?
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నేను కొన్ని ఇబ్బందుల్ని అయితే ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ‘న్యాయం కావాలి ‘ సినిమాలో శారద గారు రీ ఎంట్రీ ఇచ్చారు. కోర్టు సీన్ షూట్ నడుస్తున్న క్రమం లో ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయిన ‘క్రాంతి కుమార్ ‘ అందరి ముందు నన్ను అవమానించాడు. ఈ సినిమా సెట్ లో జగ్గయ్య, శారద, రాధిక లాంటి దిగ్గజ నటినటులు ఉన్నారు. నా షాట్ ఎప్పుడు వస్తుందా అని నేను బయట ఎదురు చూస్తున్నాను. ఇక ఆలోపే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నన్ను లోపలికి రమ్మన్నాడు. ఇక అది చూసిన క్రాంతి కుమార్ గారు నాపై కేకలు వేశారు. పిలిస్తే గాని రావా అంటూ అరవగా, అక్కడ సెట్ లో ఉన్న వాళ్ళందరి ముందు నాకు తీవ్రమైన అవమానం జరిగినట్టుగా అనిపించింది. అందుకే ఆరోజు అన్నం కూడా తినలేదు. ప్యాకప్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇక అప్పుడు క్రాంతి కుమార్ గారు నాకు ఫోన్ చేసి శారద గారికి మెమొరీ లాస్ ఉండడం వల్ల డైలాగ్స్ పెద్దగా చెప్పలేకపోతుంది అని చిరంజీవితో చెప్పారట. ఇక అదే ఫ్రస్టేషన్ ని ఆయన చిరంజీవి మీద చూపించాడని కూడా చిరంజీవికి తెలిసిందట. అయితే చిరంజీవి ప్యాకప్ అయ్యక ఇంటికి రాగానే క్రాంతి కుమార్ ఫోన్ లో మాట్లాడుతూ, మీరు ఏమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నారా బయట నుంచొని వెయిట్ చేయడానికి అని అనడం తో చిరంజీవి ఎస్ అని చెప్పి నేను సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లి చూపిస్తానని తానకు తాను ఛాలెంజ్ చేసుకొని మరి ఈ పోజిషన్ కి వచ్చానని చెప్పాడు…
ఇక దీంతోపాటుగా చిరంజీవి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని మధ్యతరగతి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, అందుకే తన ఇంట్లో అనవసరమైన ఖర్చులేమి లేకుండా చూసుకుంటానని చెబుతూనే కొన్ని ఉదాహరణలను కూడా చెప్పాడు. అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో వాళ్ళందరూ లైట్లు వేసి ఆ స్విచ్ లను ఆఫ్ చేయడం మర్చిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇక దానికోసమే నేను సపరేట్ గా ఒక యాప్ పెట్టుకొని దాని ద్వారా ఇంట్లో ఉండే విషయాలన్నింటిని తెలుసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. ఇక ఇప్పటికీ కూడా షాంపు అయిపోయిన వెంటనే దాంట్లో నీళ్లు పోసుకుని మరి వాడతానని మధ్య తరగతి కుటుంబం నుంచి రావడం వల్లే నాకు ఇలాంటి అలవాట్లు వచ్చాయని, అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు నేను అలాంటి పద్ధతినే పాటిస్తానని చిరంజీవి చెప్పడం విశేషం…