Nayanthara-Vignesh: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న చాలా మంది విడిపోవడం ప్రస్తుతం కామన్ గా మారింది. సెలబ్రెటీలు కూడా ఇదే విధంగా విడిపోతున్నారు. అయితే సోషల్ మీడియా వచ్చాక ప్రతి చిన్న విషయం వైరల్ గా మారడమే కాదు.. సెలబ్రెటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా తెలిసిపోతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ నయనతార గురించి కూడా అలాంటి ఓ వార్త వైరల్ గా మారింది.
నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం జరిగిన తర్వాత భర్త మీద ఉన్న ప్రేమతో ఆయన పేరు మీదకు తన ఆస్తులు అన్నీ మార్పించింది. పెళ్లి తర్వాత భర్తనే సర్వస్వం అని ఈ నిర్ణయం తీసుకుందట నయనతార. కానీ ఏమైందో తెలియదు కానీ మళ్లీ ఆ ఆస్తులు అన్నీ తన పేరు మీదకు మార్చేసుకుంటుందట ఈ బ్యూటీ. కారణం తెలియకపోయినా.. ఈ మ్యాటర్ మాత్రం విడాకులకు ముందు సింటమ్ అంటున్నారు నెటిజన్లు.
ఆస్తులు మార్చుకుంటుంది అనే విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. నయనతార-విఘ్నేష్ లు విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త మాత్రం వైరల్ గా మారుతుంది. రీసెంట్ గా వేణు స్వామి ఈ ఇద్దరు విడిపోతారు అని చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ వార్తలు విడాకులకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
ఇప్పటికే వస్తున్న పుకార్లకు ఎండ్ కార్డ్ ఇవ్వకుండా నయనతార ఆస్తులు ట్రాన్స్ ఫర్ అనే వార్త రావడంతో ఇంతకీ ఏం జరుగుతుంది అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా తన రేంజ్ ను పెంచేలా జవాన్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఈమె చేతిలో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఉన్నాయి. మరి సినిమాల బిజీలో పడి ఈ వార్తలకు పులిస్టాప్ పెడుతుందో లేదో చూడాలి నయనతార.