‘ఆచార్య’: రాంచరణ్ షాకింగ్ లుక్

మెగాస్టార్ చిరంజీవి ఓవైపు.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోవైపు నిలబడితే థియేటర్లు ఊగిపోవా? ‘ఆచార్య’ సాక్షిగా అదే జరుగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. ఈ చివరి […]

Written By: NARESH, Updated On : July 10, 2021 8:06 pm
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ఓవైపు.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోవైపు నిలబడితే థియేటర్లు ఊగిపోవా? ‘ఆచార్య’ సాక్షిగా అదే జరుగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది.

ఈ చివరి షెడ్యూల్ లో రాంచరణ్ పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

‘ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి’ అని పేర్కొంటూ ‘ఆచార్య’ కొత్త పోస్టర్ లో రాంచరణ్ రాజసం ఒలకబోసాడు. కోరమీసాలతో మెడలో రుద్రాక్ష.. నుదిటిన బొట్టుతో నడుచుకుంటూ వస్తూ అదిరిపోయేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ‘కామ్రేడ్ సిద్ధ’ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది.

ఇక త్వరలోనే చిరంజీవి కూడా ఈ ధర్మస్థలి సెట్స్ లో అడుగుపెడుతారని తెలుస్తోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.