20 నిమిషాలకి ఆ హీరోయిన్ కు కోటి రూపాయలు !

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ ‘పూజా హెగ్డే’ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తనకున్న డిమాండ్ ను బాగానే క్యాష్ చేసుకుంటుంది పూజా. ముఖ్యంగా రెమ్యూనరేషన్‌ విషయంలో అసలు మొహమాట పడట్లేదు. ‘ఆచార్య’ సినిమాలో ఆమెది కేవలం 20 నిమిషాల పాత్ర. అంటే సినిమాలో మహా అయితే గట్టిగా ఏడు సీన్స్ లో కనిపిస్తోంది. కానీ తనకు సమయంతో సంబంధం […]

Written By: Neelambaram, Updated On : January 30, 2021 11:02 am
Follow us on


మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ ‘పూజా హెగ్డే’ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తనకున్న డిమాండ్ ను బాగానే క్యాష్ చేసుకుంటుంది పూజా. ముఖ్యంగా రెమ్యూనరేషన్‌ విషయంలో అసలు మొహమాట పడట్లేదు. ‘ఆచార్య’ సినిమాలో ఆమెది కేవలం 20 నిమిషాల పాత్ర. అంటే సినిమాలో మహా అయితే గట్టిగా ఏడు సీన్స్ లో కనిపిస్తోంది. కానీ తనకు సమయంతో సంబంధం లేదన్నట్టు ఆ 20 నిమిషాల పాత్ర కోసం పూజా ఏకంగా కోటి రూపాయలు తీసుకుంటుందట.

Also Read: సంక్రాంతి సెంటిమెంట్ వదలనంటున్న మహేష్

కొంచెం ఆశ్యర్యంగానే ఉన్నా ఇదే నిజమే అని మేకర్స్ నుండి కూడా క్లారిటీ వచ్చింది. మరి అంత మొత్తంలో అందుకున్న పూజా క్యారెక్టర్‌ సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి. నిజానికీ తనకు డేట్స్ కుదరకపోయినా.. పూజా ప్రస్తుతం చేస్తోన్న సినిమాల మేకర్స్ ను రిక్వెస్ట్ చేసుకుని మరీ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించిందట. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మే 7 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్.

Also Read: ఆచార్య టీజర్ రెడీ.. అదరిపోవడం ఖాయం !

పైగా కొరటాల ఈ సినిమాలో ఓ కామెడీ ట్రాక్ ను పెట్టారు. అది శ్రీధర్ సిపాన చేత రాయించారు. మొత్తానికి మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. ముందుగా యాక్షన్ లేని సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారని.. ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ను తీస్తారని తెలుస్తోంది. ఇక ఆచార్య షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్‌ లేకుండా లూసిఫర్ రీమేక్‌ షూటింగ్‌ లో చిరు జాయిన్‌ అవుతాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్