https://oktelugu.com/

ఒక్కటైనా దక్కేనా..? ఆశలు పెట్టుకున్న కమలం

దేశవ్యాప్తంగా మంచి ఊపుమీదున్న కమలం మరో విజయంపై గురిపెట్టింది. ఏడాది దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చెర్రి రాష్ర్టాల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే ఇక్కడ కాషాయ పార్టీ విజయం సాధించే రాష్ట్రాలు ఏవీ లేవనే చెప్పాలి. అస్సాం ఒక్కటే కమలనాథుల్లో ఆశ. అందుకే కొంత ఆశలున్న పశ్చిమ బెంగాల్ పై బీజేపీ దృష్టి పెట్టింది. అతిపెద్ద రాష్ర్టం కావడం, ఇప్పటికే బీజేపీ కొంత బలం పెంచుకోవడంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 30, 2021 / 10:49 AM IST
    Follow us on


    దేశవ్యాప్తంగా మంచి ఊపుమీదున్న కమలం మరో విజయంపై గురిపెట్టింది. ఏడాది దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చెర్రి రాష్ర్టాల ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే ఇక్కడ కాషాయ పార్టీ విజయం సాధించే రాష్ట్రాలు ఏవీ లేవనే చెప్పాలి. అస్సాం ఒక్కటే కమలనాథుల్లో ఆశ. అందుకే కొంత ఆశలున్న పశ్చిమ బెంగాల్ పై బీజేపీ దృష్టి పెట్టింది. అతిపెద్ద రాష్ర్టం కావడం, ఇప్పటికే బీజేపీ కొంత బలం పెంచుకోవడంతో అక్కడ తమ బలగాలను ఎక్కువ మోహరించాలని నిర్ణయించింది.

    Also Read: రెండు కన్నీటిబొట్లు రైతు ఉద్యమాన్ని మలుపుతిప్పాయి

    ఇక తమిళనాడులో బీజేపీకి అవకాశాలు లేవు. అక్కడ అన్నా డీఎంకే కూటమిలో ఉండడం, ఆ పార్టీ పదేళ్లపాటు అధికారంలో ఉండడంతో తమిళనాట కూడా ఆశలు వదులుకోవాల్సిందే. పుదుచ్చెరిలో కొంత అవకాశాలున్నా.. అది అతిచిన్న రాష్ట్రం. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేత బీజేపీ కథ నడిపిస్తోంది. ఇక్కడ అధికారంలోకి వచ్చినా బీజేపీకి ముఖ్యమంత్రి అయ్యేంత సీన్ ఉండదు. ఇక అస్సాం ఒక్కటే ఆశాకిరణం. ఇక్కడ బీజేపీకి గెలుపు అవకాశాలు కూడా ఉన్నాయి.

    Also Read: రైతు చట్టాలు.. రాష్ట్రపతి నోట.. పార్లమెంట్ లోనూ మార్మోగింది

    ఇక కేరళ విషయానికొస్తే… అక్కడ వేలు కూడా పెట్టలేని పరిస్థితి. కేరళాలో ఎల్టీఎఫ్, యూటీఎప్ లు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లోనే బీజేపీ కేవలం ఒక్కస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి రెండంకెల సీట్లు రావడం కూడా బీజేపీకి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీతో పశ్చిమ బెంగాల్లో విజయం సాధించి దేశ వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ తగ్గలేదని నిరూపించాలని కమలనాథులు కసరత్తు ప్రారంభించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఎన్నికల షెడ్యూల్ విడుదల కన్నా ముందుగానే అభ్యర్థులను నిర్ణయించాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే తృణముల్ కాంగ్రెస్ నుంచి 19మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ బీజేపీలో చేరారు. మరో 41మంది ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు. వీరంతా చేరిన తరువాత అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారాన్ని ప్రారంభించాలని బీజేపీ నిర్ణయిస్తోంది. త్వవరలో ఇక్కడ అమిత్ షా పర్యటన కూడా ఉండనుంది. గెలువు అవకాశాలపై సర్వే నిర్వహించిన తరువాతే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో తప్పితే.. మరెక్కడా.. బీజేపీకి గెలిచే అవకాశం లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.