Acharya Movie Review: రివ్యూ: ఆచార్య
రేటింగ్: 2.5 / 5
నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్ తేజ, పూజా హెగ్డే, సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి
దర్శకత్వం :కొరటాల శివ
నిర్మాతలు : రామ్ చరణ్ , నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీత దర్శకుడు : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : తిర్రు
ఎడిటర్ : నవీన్ నూలి
క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం
కథ :
పాద ఘట్టం సంరక్షకుడిగా సిద్ద (రామ్ చరణ్) ఉన్నంత కాలం ధర్మస్థలంలో ధర్మం విరాజిల్లుతూ ఉండేది. అయితే,
ఎంతో ప్రసిద్ది గాంచిన ధర్మస్థలాన్ని సొంతం చేసుకోవాలనే అశతో బసవ(సోనూసూద్) చేసే కుట్ర కారణంగా ధర్మస్థలానికి సిద్ధ దూరం అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. ధర్మస్థలంలో అధర్మం రాజ్యం వెళ్తుంది. ఈ క్రమంలో ఆచార్య (చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ(సోనూసూద్) మరియు అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా అరికట్టాడు ? ఆచార్యకి ధర్మస్థలికి ఉన్న సంబంధం ఏమిటి ? అసలు ఆచార్య ఎవరు ? సిద్ధాకి ఆచార్యకి మధ్య ఉన్న బంధం ఏమిటి ? ఇంతకీ ధర్మస్థలిలో నీలాంబరి (పూజా హెగ్డే) సిద్ధ కోసం ఎందుకు చూస్తూ ఉంటుంది ? సిద్ద (రామ్ చరణ్) ఏమైపోయాడు ? చివరకు ఆచార్య ధర్మస్థలి కోసం ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఆచార్య గురించి సింపుల్ గా చెప్పాలంటే.. సినిమాలో సోషల్ మెసేజ్ బాగున్నా.. సోల్ మిస్ అయ్యింది. చిరు – చరణ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ ఉన్నా.. ఎమోషన్ మిస్ అయ్యింది. చరణ్ – పూజ మధ్య ప్రేమ ఉన్నా.. ఫీల్ మిస్ అయ్యింది. దీనికితోడు మా సినిమా అద్భుతంగా భారీ స్థాయిలో ఉంటుంది అంటూ ఈ సినిమా పై మెగాస్టార్ పెంచిన భారీ అంచనాలు కూడా ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ అయ్యింది.
మెగాస్టార్ ఆచార్య గురించి చెప్పిన మాటలకు, సినిమాలోని, సాంకేతిక వర్గం పనితనానికి పొంతన లేదు. భారీ బడ్జెట్ తో రూపొందింది అని పేరే గానీ, సినిమాలో ఆ భారీతనం కనిపించలేదు. సహజంగా తీయాలనే తాపత్రయంలో గ్రాండ్ విజువల్స్ ను కూడా రొటీన్ చేసి పారేశారు. పైగా ఒక్క క్లైమాక్స్ కి తప్ప ఇక దేనికి బడ్జెట్ పెట్టలేదు.
ఆచార్య మొదలైన మొదటి నిమిషం నుంచి మెగా అభిమానులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. వారికి కొరటాల శివ ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ప్రతి పది సీన్స్ కి ఒక భారీ ఎలివేషన్ సీన్ ఉంటుంది. విలన్ బ్యాచ్ గాల్లో తేలుతూ ఉంటారు. మెగాస్టార్ బిల్డప్ షాట్స్ పడుతూ ఉంటాయి. కానీ, ఫ్యాన్స్ లో ఉత్సాహం లేదు. కారణం.. కథలో కథనంలో కంటెంట్ లేకపోవడమే.
ఆచార్య సినిమా చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ఈ చిత్రం బోరింగ్ ప్లేతో సాగే సోషల్ లాజిక్ లెస్ యాక్షన్ డ్రామా. మొత్తానికి అద్భుత సినిమా అంటూ వచ్చి.. దిగువస్థాయి సినిమా అయిపోయింది ఆచార్య. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కి పూర్తి నిరుత్సాహమే మిగిలింది.
కాకపోతే, ఫస్ట్ హాఫ్ లో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. చరణ్ -పూజల కెమిస్ట్రీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యింది. చివరగా ఎమోషనల్ గా సాగే ఈ యాక్షన్ డ్రామా తన స్థాయికి తగ్గట్టు లేదు.
ప్లస్ పాయింట్స్ :
మెగా స్టార్, మెగా పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్సీ,
పూజా హెగ్డే గ్లామర్.
భారీ యాక్షన్ విజువల్స్,
మైనస్ పాయింట్స్ :
లాజిక్ లెస్ సోషల్ డ్రామా,
రొటీన్ సీన్స్ తో సాగే స్లో నేరేషన్,
స్లోగా సాగే బోరింగ్ స్క్రీన్ ప్లే,
సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,
కొరటాల స్క్రిప్ట్ సింపుల్ గా ఉండటం.
అన్నిటికీ మించి కొరటాల మార్క్ పుష్కలంగా మిస్ అవ్వడం.
సినిమా చూడాలా ? వద్దా ?
ఆచార్య అంటూ ప్యూర్ సోషల్ డ్రామా వ్యవహారాలతో వచ్చిన ఈ సినిమాలో చరణ్ – చిరు కాంబినేషన్,
కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ బాగున్నాయి. అలాగే మెయిన్ పాయింట్ లోని మెయిన్ కంటెంట్ బాగుంది, కానీ, మిగిలిన బాగోతం అంతా 90 కాలం రొట్ట కొట్టుడు మేకింగ్ స్టైల్ తో రొటీన్ బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాలతో నిరాశ పరిచింది. ఓవరాల్ గా అంచాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం అభిమానులను కూడా నిరుత్సాహ పరిచింది.
Also Read:Mahesh Babu: మహేశ్ బాబుకు నచ్చని ఆయన సినిమా ఏంటో తెలుసా?
Recommended Videos: