
మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ఆచార్య’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చెర్రీ రోల్ మొదట 30 నిమిషాలు ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తర్వాత సిద్ధ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం. ఈ మేరకు రాజమౌళితో చిరు ప్రత్యేకంగా మాట్లాడి, డేట్స్ అడ్జెస్ట్ చేయించారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. తాజాగా ఆచార్యకు సంబంధించి కీ పాయింట్స్ లీకయ్యాయి. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో చిరుతోపాటు రామ్ చరణ్ నక్సలైట్లుగా కనిపించబోతున్నారన్న విషయం తెలిసిందే. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం.. గోదావరి జిల్లాలోని మారేడు మిల్లి అడవుల్లో కొనసాగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.
Also Read: లవర్ బోయ్స్ కాదు.. యాక్షన్ స్టార్స్.. యంగ్ హీరోస్ మేకోవర్ కేక!
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన పాటలు, రెండు సీన్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో చిరు-కాజల్ మధ్య ఒకటి, చెర్రీ-పూజా యుగళగీతం మరొకటి ఉంటుందట. ఇక మెగాస్టార్ – రెజీనా మధ్య కూడా మరొకటి ఉంటుందని సమాచారం. శివుడి మీద కూడా మరో పాట ఉంటుందట. ఇంద్ర సినిమాలోని ‘బంబంబోలే’ తరహాలో అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.
Also Read: సెట్స్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ పిక్స్ లీక్.. మంటలు రేపుతున్న చిత్రాలు!
ప్రధానంగా చిరు-రెజీనా మధ్య వచ్చే మాస్ సాంగ్ ఫ్యాన్స్ తో కేక పెట్టిస్తుందని భోగట్టా. ఇందులో ఇందులో మెగాస్టార్ స్టెప్పులు.. నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటాయట. చిరులోని గ్రేస్ ను మరో లెవల్ కు తీసుకెళ్తుందట ఈ సాంగ్. అంతేకాకుండా.. చిరు – చెర్రీ మధ్య వచ్చే మాస్ సాంగ్ దుమ్ము లేపుతుందని విశ్వసనీయ సమాచారం. ఇక, సినిమా క్లైమాక్స్ లో కాలికా దేవి సాంగ్ తో ఫైట్ మొదలవుతుందట. ఈ రెండూ రోమాంచితంగా ఉంటాయని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఇక, మణిశర్మ అంటేనే బ్యాగ్రౌండ్ స్కోర్ కేక పెడుతుంది. ఈ సినిమాలోనూ అంతకు మించి అన్నట్టుగా అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడట మెలోడీ బ్రహ్మ. ప్రత్యేకంగా చరణ్ ఎంట్రీ స్కోర్ గూస్ బంస్ అనిపిస్తుందట. ఇవన్నీ చూడాలంటే.. మే 14 వరకు వెయిట్ చేయాల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.