https://oktelugu.com/

విశాఖకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ షిఫ్ట్‌

ఏపీలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక మూడు పరిపాలన రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లు కోర్టు కేసులతో పనులు ఆ ప్రాసెస్‌కు బ్రేక్ పడింది. కానీ.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముమ్మర చర్యలను చేపట్టినట్టే కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అనంతరం ఉద్యమ ప్రభావం అనుకున్నంత స్థాయిలో లేదనే నిర్ణయానికి వచ్చిన జగన్ సర్కార్.. ఆ ప్రక్రియను మరింత వేగవంతం […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 4, 2021 / 01:37 PM IST
    Follow us on


    ఏపీలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక మూడు పరిపాలన రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లు కోర్టు కేసులతో పనులు ఆ ప్రాసెస్‌కు బ్రేక్ పడింది. కానీ.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముమ్మర చర్యలను చేపట్టినట్టే కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అనంతరం ఉద్యమ ప్రభావం అనుకున్నంత స్థాయిలో లేదనే నిర్ణయానికి వచ్చిన జగన్ సర్కార్.. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయానికి వచ్చింది.

    Also Read: జగన్ కూతుళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

    విజయవాడలో నిర్మించ తలపెట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను విశాఖపట్నానికి తరలిస్తూ ఆదేశాలను జారీ చేయడం దీనికి సంకేతంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై 400 రోజులకు పైగా అమరావతి ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతూ వస్తున్నాయి. అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ సారథ్యాన్ని వహిస్తోంది. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగింపజేయాలంటూ వేర్వేరు రూపాల్లో డిమాండ్ చేసింది.

    Also Read: ఏపీ పోర్టులన్నీ ఆ దిగ్గజ పారిశ్రామికవేత్తకేనా?

    ఈ ఆందోళనలను జగన్ సర్కార్ చూసీచూడనట్టు వ్యవహరించిందే తప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదు. న్యాయపరమైన ఇబ్బందులేవీ లేకపోయి ఉంటే ఈ పాటికి విశాఖ నుంచి పరిపాలన ఆరంభమై ఉండేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్యమం ప్రభావం.. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేకపోయింది. అమరావతి ప్రాంతంలోని అనేక పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు స్వీప్ చేశారు. ఉద్యమానికి గుండెకాయగా భావించే గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అమరావతి ఒక్కటే కాదు.. అటు పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసుకున్న ఉత్తరాంధ్ర, న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన రాయలసీమ జిల్లాల్లోనూ వైసీపీ అనుకూలంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో నిరసన ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది తేలింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభించేలా ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో నిర్మించడానికి ప్రతిపాదించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఇక సాగరనగరంలో నిర్మించడానికి పూనుకుంది. దీనికి అవసరమైన ఉత్తర్వులను హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. క్రమంగా కార్యాలయాలను తరలించాలని కూడా భావిస్తోంది. ఇక జాప్యం చేయకూడదనే నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లు చెబుతున్నారు.