https://oktelugu.com/

జగన్ కూతుళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

జగన్మోహన్ రెడ్డి.. ఏపీ సీఎంగా ఉన్న ఈయన రాజకీయంలో ప్రావీణ్యం సాధించి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్న జగన్ ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న పేరు సంపాదిస్తున్నాడు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి మన్ననలను పొందుతున్నాడు. ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న జగన్ కుటుంబానికి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నాడు. జగన్ దాదాపు అన్నివిధాలుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఇప్పుడు ఆయన కుమార్తెలు కూడా రికార్డులు సాధిస్తూ తండ్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2021 / 01:22 PM IST
    Follow us on

    జగన్మోహన్ రెడ్డి.. ఏపీ సీఎంగా ఉన్న ఈయన రాజకీయంలో ప్రావీణ్యం సాధించి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్న జగన్ ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న పేరు సంపాదిస్తున్నాడు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి మన్ననలను పొందుతున్నాడు. ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న జగన్ కుటుంబానికి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నాడు.

    జగన్ దాదాపు అన్నివిధాలుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఇప్పుడు ఆయన కుమార్తెలు కూడా రికార్డులు సాధిస్తూ తండ్రి పేరు నిలబెడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుతూ ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లలో సీట్లు సంపాదించారు. తండ్రి చెప్పిన బాటలో వెళుతూ సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇటీవల జగన్ కూతుర్లిద్దరిపై జగన్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

    సీఎం జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. హర్షిణి, వర్షా. వారిలో పెద్ద కూతురు హర్షిణి రెడ్డి ప్రాన్స్ రాజధాని పారిస్ లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో సీటు దక్కింది. ఇప్పటికే ఇంగ్లాండ్ లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె పారిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువబోతుంది. దీంతో పార్టీ కార్యర్తలతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇక జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్టాత్మక నోట్రే డామ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ఇటు హర్షిణి రెడ్డి సాధించిన ఘనతకు జగన్ వర్గాల్లో ఆనందానికి అవదుల్లేకుండా పోతున్నాయి. అటు జగన్ ఫ్యామిలీలోనూ తమ వారు ఇంత పెద్ద చదువులు చదవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.