Acharya Movie Dialogues in Telugu: క్లాస్ అండ్ కూల్ డైరెక్టర్ ‘కొరటాల శివ’ డైరెక్టర్ గా మారక ముందు డైలాగ్ రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేశారు. కొరటాల డైలాగ్ లో పంచ్ కంటే కూడా డెప్త్ ఉంటుంది. అందుకే.. కొరటాల సినిమాల్లో డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్
స్టార్ రామ్ చరణ్ కలయికలో కొరటాల దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఆచార్య‘.
ఇప్పటికే ఈ సిమిమా టీజర్స్ లోని డైలాగ్స్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. అందుకే.. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ లో బెస్ట్ డైలాగ్స్ మీ కోసం.
Acharya Movie Dialogues in Telugu
ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు.

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరు ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో.

ధర్మస్థలికి ఆపద వస్తే, అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపిద్ధి.

చిరుతకు వేట, ఈ చిరంజీవికి బాట ఎవ్వరూ నేర్పించక్కర్లేదు.

స్వార్ధంతో నిండిపోయిన ఈ సమాజంలో కూడా.. దేవుడు ఇంకా గుడిలో ఉంటాడని ప్రజలు నమ్ముతున్నారు. నీలాంటి వాళ్ళు ఆ నమ్మకాన్ని కూడా చంపేస్తే.. నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు.

మెగాస్టార్ పాత్ర విలన్ల పాత్రలతో మాట్లాడుతూ.. ‘మీకు దేవుడు అంటే భయం, మాకు దేవుడు అంటే అభయం. మీలో స్వార్ధం ఉంటుంది, మేము నిస్వార్ధంగా ఉంటాం. ఎప్పటికీ మీరు మేము ఒక్కటి కాము’.

చరణ్ పాత్ర మెగాస్టార్ పాత్రను ఉద్దేశించి చెబుతూ.. “ఆయన పోరాటం వాళ్ళ మీద కాదు, వాళ్లను పుట్టిస్తున్న ఈ వ్యవస్థ మీద”.

మెగాస్టార్ పాత్ర విలన్ పాత్రతో మాట్లాడుతూ.. ‘నా జర్నీలో నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసాను. కానీ, నాలాంటి వాడిని మాత్రం నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావ్. నువ్వు నా ముందు జస్ట్ ఒక బచ్చాగాడివిరా !’

చిరు – చరణ్ లు ఒకే ప్రైమ్ లో కనిపిస్తే.. చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం ఆచార్య రూపంలో త్వరలోనే రానుంది. పైగా ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండబోతుంది. చిరు – చరణ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తాయి. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రన్ టైం సుమారు 2 గంటల 58 నిమిషాలు ఉండేలా కొరటాల ప్లాన్ చేశాడు.
Also Read: RRR Movie Dialogues: Popular dialogues from the film RRR