https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్ లో రీమేక్ చెసిన సినిమాలు ఎన్ని హిట్ ? ఎన్ని ఫట్ ? అంటే !

Pawan Kalyan: తమిళనాట విజయ్ అక్కడ స్టార్ హీరోగా ఎదగడం వెనుక తెలుగు సినిమాలేననడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాను విజయ్ తమిళంలో చేసి హిట్ కొట్టాడు. ఇక తెలుగు హిట్ సినిమాలను అక్కడ తీసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇలా తమిళంలోనే కాదు తెలుగులోనూ ‘రిమేక్’ స్టార్లు ఉన్నారు. ఎక్కువగా విజయ్ సినిమాలు రిమేక్ చేసి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు మన పవర్ స్టార్. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2022 / 12:45 PM IST
    Follow us on

    Pawan Kalyan: తమిళనాట విజయ్ అక్కడ స్టార్ హీరోగా ఎదగడం వెనుక తెలుగు సినిమాలేననడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాను విజయ్ తమిళంలో చేసి హిట్ కొట్టాడు. ఇక తెలుగు హిట్ సినిమాలను అక్కడ తీసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇలా తమిళంలోనే కాదు తెలుగులోనూ ‘రిమేక్’ స్టార్లు ఉన్నారు. ఎక్కువగా విజయ్ సినిమాలు రిమేక్ చేసి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు మన పవర్ స్టార్. టాలీవుడ్ లో రిమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. పవన్ కు రిమేక్ మూవీలు బాగా కలిసి వచ్చాయి. ఆయన కెరీర్ ను మలుపుతిప్పాయి. ‘పవర్ స్టార్’గా మన ముందు నిలబెట్టాయి.

    Pawan Kalyan, VIJAY

    పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తం మీద 24 సినిమాలు తీస్తే.. అందులో 11 రిమేక్ సినిమాలే కావడం విశేషం. వాటిలో 7 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

    Also Read: Bullet Proof: శరీరమంతా ‘బుల్లెట్ ఫ్రూఫ్’ జాకెట్లను ధరిస్తే ఏమవుతుంది?

    -తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గోకులతిల్ సీతై’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్, రాశి జంటగా తీశారు. ఇక్కడా హిట్ అయ్యింది..

    Gokulamlo Seeta

    -ఇక తమిళంలో విజయ్ నటించిన ‘లవ్ టుడే’ సినిమాను తెలుగులో పవన్, దేవయానీలను పెట్టి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సుస్వాగతం’గా చేశారు. ఈసినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి పవన్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

    Suswagatham

    -ఇక తమిళంలో ‘విజయ్’తో ఖుషి మూవీ తీసిన దర్శకుడు ఎస్.జే సూర్య దాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రిమేక్ చేశాడు. అది కూడా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

    Kushi

    -ఇక తమిళంలో ‘తిరుపచి’ సినిమా విజయ్ హీరోగా తెరకెక్కింది. దీన్ని తెలుగులో పవన్, అసిన్ జంటగా రిమేక్ చేయగా ఇక్కడ హిట్ కొట్టింది.

    -హిందీ మూవీ ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి రిమేక్ గా తెలుగులో పవన్ , త్రిషలను పెట్టి తీసిన ‘తీన్ మార్’ మూవీ ఇక్కడ ఫ్లాప్ అయ్యింది.

    Teen Maar

    -సల్మాన్ ఖాన్ హిందీలో నటించిన ‘దబాంగ్’ మూవీకి రిమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ మూవీ ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది.

    Gabbar singh

    -హిందీ ఓ మైగాడ్ మూవీకి రిమేక్ గా తెలుగులో వెంకటేశ్, పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ మూవీ కూడా ఇక్కడా హిట్ గా నిలిచింది.

    Gopala Gopala

    -తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వీరం’ మూవీ రిమేక్ గా తెలుగులో ‘కాటమరాయుడు’ తీశారు. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ కొట్టింది.

    Katamarayudu

    ఇక హిందీలో అమితాబ్, తాప్సీ జంటగా నటించిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో పలు కీలక మార్పులు చేసి పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’గా తీశారు. అది ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లలో ఒకటిగా నిలిచింది.

    Vakeel Saab

    మొత్తంగా రిమేక్ మూవీలతో పవన్ కళ్యాణ్ దాదాపు పది వరకూ హిట్స్ కొట్టాడు. అందులో పవన్ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ ను పవర్ స్టార్ గా మలచడంలో ఈ చిత్రాలు దోహదపడ్డాయి.

    Also Read:

    KGF Chapter 2: తెలంగాణలో కేజీఎఫ్-2 టిక్కెట్ల రేట్లు పెంపు.. డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట..

    Tags