వెనక్కి తగ్గిన చిరంజీవి.. కారణమేంటి?

దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు, థియేటర్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరగా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు సినిమా, టీవీ షూటింగులను ప్రారంభించుకోవచ్చని ఇటీవలే జీవో కూడా జారీ చేశారు. అదేవిధంగా ఏపీలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి షూటింగులకు అనుమతి ఇచ్చారు. దీంతో ఈనెల 15నుంచి టాలీవుడ్లో […]

Written By: Neelambaram, Updated On : June 10, 2020 9:21 pm
Follow us on


దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు, థియేటర్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో ఇటీవల లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరగా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు సినిమా, టీవీ షూటింగులను ప్రారంభించుకోవచ్చని ఇటీవలే జీవో కూడా జారీ చేశారు. అదేవిధంగా ఏపీలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి షూటింగులకు అనుమతి ఇచ్చారు. దీంతో ఈనెల 15నుంచి టాలీవుడ్లో సినిమా షూటింగుల సందడి మొదలుకానుంది.

ఇదిలా ఉంటే చిరంజీవి తాజా చిత్రం ఆచార్య విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనాకు ముందు నిర్మాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కించాలని భావించాడు. అయితే ప్రస్తుతం పరిస్థితులు దృష్ట్యా బడ్జెట్ ను తగ్గించేందుకు చిత్రబృందం మొగ్గుచూపుతుందని సమాచారం. ఈమేరకు బడ్జెట్ తగ్గించాలని దర్శకుడు కొరటాల శివకు మెగాస్టార్ సూచించారట. వీలైనంత త్వరగా సినిమాను ప్రారంభించి మూవీని కాంప్లీట్ చేయాలని భావిస్తున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది.

ప్రస్తుతానికి సినిమా షూటింగులు ప్రారంభమైనప్పటికీ థియేటర్లు ఓపెన్ కాలేదు. రానున్న రోజుల్లో థియేటర్లు ఓపెన్ అయినా జనాలు థియేటర్లు ఇంతకముందులా వచ్చే అవకాశం కన్పించడం లేదు. దీంతో భారీ బడ్జెట్లో మూవీని నిర్మిస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మెగాస్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యలో చిరుకు జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. రెజీనా కసండ్రా ఓ స్పెషల్ సాంగ్లో చిరంజీవితో ఆడిపాడనుంది. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ చిరంజీవి మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.