https://oktelugu.com/

మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు- రూ.7లక్షల కరెంట్ బిల్!

ఒక ఫ్యాన్, 3 బల్బులు ఉండి, కూలీ పని చేసుకుంటూ ఉండే ఒక ఇంటి యజమానికి రూ. 7 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ప్రతి నెలా రూ.500 మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. గతనెల ఫిబ్రవరిలో కూడా రూ. 414 మాత్రమే కరెంటు బిల్లు వచ్చింది. ఈ నెల రూ.7 లక్షలకు పైగా రావడంతో ఆ ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. తాము బిల్లు ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నాడు. కామారెడ్డి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 10, 2020 / 07:54 PM IST
    Follow us on

    ఒక ఫ్యాన్, 3 బల్బులు ఉండి, కూలీ పని చేసుకుంటూ ఉండే ఒక ఇంటి యజమానికి రూ. 7 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ప్రతి నెలా రూ.500 మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. గతనెల ఫిబ్రవరిలో కూడా రూ. 414 మాత్రమే కరెంటు బిల్లు వచ్చింది. ఈ నెల రూ.7 లక్షలకు పైగా రావడంతో ఆ ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. తాము బిల్లు ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నాడు.

    కామారెడ్డి జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రూ.500 విద్యుత్ బిల్లు వచ్చే ఇంటికి రూ.7,29,471 బిల్లు ఇచ్చారు. దీంతో ఆ ఇంటి యజమాని ఒక్కసారి అవాక్కయ్యాడు. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గాండ్ల శ్రీనివాస్ వ్యవసాయం కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నాయి. ప్రతి నెలా రూ.500 కరెంట్ బిల్లు వస్తుంది. గత ఫిబ్రవరి నెలలో రూ.415 విద్యుత్ బిల్లు చెల్లించాడు. మార్చి, ఏప్రిల్, మే నెలలో కరోనా వల్ల విద్యుత్ బిల్లులు రాలేదు. ఈ నెలలో విద్యుత్ బిల్లులు రావడంతో ఆ ఇంటి యజమాని ఖంగుతిన్నాడు. వెయ్యి కాదు, రెండు వేలు కాదు.. ఏకంగా రూ.7 ,29,471 విద్యుత్ బిల్లు వచ్చింది. దాంతో తాము బిల్లు ఏ విధంగా చెల్లించాలో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యానికి తాము బిల్లు ఎలా కడతామని అంటున్నాడు. అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాడు.