https://oktelugu.com/

Acharya: త్వరలోనే ‘ఆచార్య’ నుంచి రెండు పెద్ద సర్​ప్రైజ్​లు

Acharya: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరు సరసన కాజల్​ అగర్వాల్​, రామ్​ చరణ్​కు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇటీవలే సిద్దా సాగా పేరులో చెర్రి పాత్రలు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది. ఇందులో చిరుతలతో చిరు, చెర్రీలను పోలుస్తూ తీసిన ఓ షాట్​ ప్రేక్షకులను విపరీతంగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 01:22 PM IST
    Follow us on

    Acharya: మెగాస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరు సరసన కాజల్​ అగర్వాల్​, రామ్​ చరణ్​కు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఇటీవలే సిద్దా సాగా పేరులో చెర్రి పాత్రలు సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది. ఇందులో చిరుతలతో చిరు, చెర్రీలను పోలుస్తూ తీసిన ఓ షాట్​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇటర్వ్యూలో ఈ సీన్​తో పాటు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.

    ఈ సినిమా ధర్మ చుట్టూ తిరుగుతుంటుంది. ధర్మానికి ప్రతిరూపం సిద్ధ పాత్ర. ఆ పాత్రను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు శాంతి శ్లోకంతో టీజర్​ను విడుదల చేయాలనుకున్నా. నా ఆలోచనను మణిశర్మకు చెప్పగా.. ఆయన వెంటనే పట్టుకుని.. సహనాభవతు శ్లోకంతో ఓ మ్యూజిక్​ క్రియేట్ చేశారు. దాంతోనే సిద్ధ టీజర్​ను తీర్చిదిద్దాం. విజువల్‌ ట్రీట్‌ కోసం చివరి షాట్‌లో చిరంజీవి, రామ్‌ చరణ్‌ని ఓ వైపు, చిరుతల్ని మరోవైపు చూపించాం. సినిమాలో ఇదో అద్భుతమైన దృశ్యం. అది వాళ్లిద్దరికే సరిగ్గా సరిపోయింది.  ఈ సినమా తీసేటప్పుడు దర్శకుడిగా కంటే.. అభిమానిగా ఆస్వాధించా. అని చెప్పుకొచ్చారు.

    Also Read: ‘అఖండ’ మూవీ రివ్యూ

    Acharya

    త్వరలోనే ఈ సినిమా నుంచి రెండు పెద్ద సర్​ప్రైజ్​లు రానున్నాయని అన్నారు శివ. వాటికి ఇంకా తేదీలు ఖరారు చేయలేదని.. చిరు, చెర్రి కలిసి డాన్స్ చేసే ఓ పాట, ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఏ సినిమాలోను చిరు, చరణ్ కలిసి ఫుల్​ సాంగ్​కు డాన్స్ చేయలేదు. ఈ క్రమంలోనే ఈ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: రాధేశ్యామ్ నుంచి మరో పాట విడుదల.. మరోసారి మాయ చేసిన సిద్​ శ్రీరామ్​