https://oktelugu.com/

Vijayalakshmi: విజయలక్ష్మి శృంగార తారగా ఎలా మారిందంటే ?

Vijayalakshmi: కడు పేదరికం, కుటుంబాన్ని పోషించడం కోసం నాలుగో తరగతిలోనే చదువుకు బ్రేక్. అనాగరిక సమాజంలో బాల్యం ముగియక ముందే వివాహం. అంత చిన్న వయసులో సంసారం. భర్త, అత్తమామల వేధింపులు… జీవితంపై పూర్తిగా ఆశ చచ్చిపోయాక ఓ చిన్న ప్రయత్నం చేసింది. సినిమాపై మక్కువతో మద్రాసు పారిపోయింది. చదువు లేదు, బాష రాదు… అయినవాళ్లు, తెలిసినవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒంటరి యుద్ధంలో విజయం సాధించి, సౌత్ చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేసింది ఓ అమ్మాయి.. ఆమె […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 2, 2021 / 01:28 PM IST
    Follow us on

    Vijayalakshmi: కడు పేదరికం, కుటుంబాన్ని పోషించడం కోసం నాలుగో తరగతిలోనే చదువుకు బ్రేక్. అనాగరిక సమాజంలో బాల్యం ముగియక ముందే వివాహం. అంత చిన్న వయసులో సంసారం. భర్త, అత్తమామల వేధింపులు… జీవితంపై పూర్తిగా ఆశ చచ్చిపోయాక ఓ చిన్న ప్రయత్నం చేసింది. సినిమాపై మక్కువతో మద్రాసు పారిపోయింది.

    Silk Smitha Birth Anniversary

    చదువు లేదు, బాష రాదు… అయినవాళ్లు, తెలిసినవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒంటరి యుద్ధంలో విజయం సాధించి, సౌత్ చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేసింది ఓ అమ్మాయి.. ఆమె ఎవరో కాదు విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత. ఏలూరు జిల్లాలోని కొవ్వాలి అనే చిన్న పల్లెటూరిలో జన్మించిన విజయలక్ష్మి బాల్యం నుండే దుర్భర జీవితం అనుభవించింది.

    ఇంత కన్నా నరకం కొత్తగా చూసేది ఏముంటుందనే మొండి ధైర్యంతో మద్రాసు పారిపోయింది. ఒక ఆర్టిస్ట్ దగ్గర టచప్ అసిస్టెంట్ గా చేరింది. పరిశ్రమలో పరిచయాలు పెంచుకుంది. తమిళ, మలయాళ కన్నడ భాషలు నేర్చుకుంది. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ఆమె ప్రస్థానం సౌత్ ఇండియా మొత్తం తనవైపు చూసేంత స్టార్ గా ఎదిగారు.

    Also Read: Acharya: త్వరలోనే ‘ఆచార్య’ నుంచి రెండు పెద్ద సర్​ప్రైజ్​లు

    సిల్క్ స్మిత కళ్ళలోనే ఓ మత్తు ఉంటుంది. అందమైన రూపం, కవ్వించే కళ్ళు ఆమెను తిరుగులేని శృంగార తారగా నిలబెట్టాయి. ఆమె అందానికి అద్భుతమైన డాన్స్ తోడు కావడంతో ఇక ఎవరూ ఆపలేకపోయారు. తెలుగు, మలయాళ, తమిళ్, కన్నడ భాషల్లో వందల చిత్రాలు చేశారు. కేవలం శృంగార పాత్రలే కాకుండా విలన్, హీరోయిన్ , క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు.

    రంగుల ప్రపంచంలో తిరుగులేని తారగా వెలుగొందిన సిల్క్ స్మిత జీవితం ముగిసిన తీరు బాధాకరం. బాల్యం నుండే మానసిక యుద్ధం చేస్తున్న సిల్క్ స్మిత ఓ బలహీన క్షణంలో తనువు చాలించాలనే నిర్ణయం తీసుకున్నారు. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని ఉసురు తీసుకున్నారు. 1960 డిసెంబర్ 2న జన్మించిన సిల్క్ స్మిత 61వ జయంతి నేడు.

    Also Read: Akhanda: థియేటర్​లో బాలయ్య ఫ్యాన్స్​కు షాక్​.. ‘అఖండ’ సినిమా ఆపేసి పోలీసులు వార్నింగ్​

    Tags