https://oktelugu.com/

Akhanda: థియేటర్​లో బాలయ్య ఫ్యాన్స్​కు షాక్​.. ‘అఖండ’ సినిమా ఆపేసి పోలీసులు వార్నింగ్​

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా అఖండ. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సోషల్​మీడియాలో బాలయ్య ఫ్యాన్స్​ రచ్చ మాములుగా లేదు. విదేశాల్లోనే బాలయ్య మ్యానియా ఎక్కడా తగ్గట్లేదు. ఈ సినిమాలో ప్రతి ఎలివేషన్​ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమనే చెప్పాలి. గతంలో వీరిద్దరి కలయికలో సింహా, లెజెండ్​ సూపర్​ హిట్​ అందుకున్నాయి. మరోవైపు థమన్ మ్యూజిక్ సినిమాలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 12:49 PM IST
    Follow us on

    Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా అఖండ. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సోషల్​మీడియాలో బాలయ్య ఫ్యాన్స్​ రచ్చ మాములుగా లేదు. విదేశాల్లోనే బాలయ్య మ్యానియా ఎక్కడా తగ్గట్లేదు. ఈ సినిమాలో ప్రతి ఎలివేషన్​ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమనే చెప్పాలి. గతంలో వీరిద్దరి కలయికలో సింహా, లెజెండ్​ సూపర్​ హిట్​ అందుకున్నాయి. మరోవైపు థమన్ మ్యూజిక్ సినిమాలో పూనకాలు తెప్పించాయట.

    Akhanda Balakrishna

    అయితే, తాజాగా బాలయ్య అభిమానులు సినిమా థియేటర్లో చేసిన రచ్చకు పోలీసులు షాక్​ ఇచ్చారు. అయితే, అది కూడా ఆస్ట్రేలియాలో కావడం విశేషం. ఆస్ట్రేలీయాలోని ఓ థియేటర్​లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చకు థియేటర్​ ఓనర్​ మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్​ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు అసలు తగ్గకపోవడం వల్ల.. పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

    Also Read: డల్లాస్​లో అఖండ విజయోత్సవం.. నెట్టింట్లో వీడియో వైరల్​

    మరోవైపు అమెరికాలోనూ బాలయ్య ఫ్యాన్స్ ను ఉద్దేశించి సినిమార్క్​ థియేటర్​లో అలర్ట్ నోట్​ పెట్టారు. థియేటర్​ సౌండ్​ను నిర్దిష్ట పరిథిలో పెట్టడం జరిగిందని.. ఏదేమైనప్పటికి సౌండ్ పెంచడం కుదరదని అభిమానులకు సూచిస్తూ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. యూఎస్​లో ఓ తెలుగు సినిమాకు ఇలా నోట్​ అంటించడం ఇదే తొలిసారి.మరి బాలయ్య అంటే ఆమాత్రం ఉండాలి.

    ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించగా.. శ్రీకాంత్​, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.

    Also Read: బాలయ్య అఖండ హిట్​ టాక్​ అందుకోవాలంటే రాబట్టాల్సిన కలెక్షన్​ ఎంతో తెలుసా?