Abhishek Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీ లో బిగ్ బి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అమితాబచ్చన్…దాదాపు 50 సంవత్సరాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఈ హీరో ఇప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. 80 సంవత్సరాల వయసులో కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్న అమితాబచ్చన్ ఇప్పటికి ఛాలెంజింగ్ క్యారెక్టర్ లను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అభిషేక్ బచ్చన్ సైతం అడపదడప సినిమాలను చేస్తూ హీరోగా తన కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు. అమితాబచ్చన్ కి వచ్చిన క్రేజ్ అభిషేక్ బచ్చన్ కి రాకపోయినా కూడా వైవిధ్య భరితమైన పాత్రలను చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇక రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఎంటైర్ కెరియర్ లో తన మొదటి సినిమా చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అశోక్ అనే మేకప్ మ్యాన్ తనకు మేకప్ వేస్తున్నారట. రీసెంట్ గా ఆయన అనారోగ్య కారణంగా చనిపోవడంతో ఆయన ఆ విషయాన్ని గుర్తు చేసుకన్నాడు. నా కెరియర్ లో అశోక్ దాదా ది చాలా కీలకమైన పాత్ర…
నేను ఏ సినిమా చేసిన కూడా తనే నాకు మేకప్ వేస్తుంటాడు. సినిమా ఓకే చేసిన తర్వాత మొదటి రోజు సెట్లోకి అడుగు పెట్టినప్పుడు తన కాళ్ళకి మొక్కి తన ఆశీర్వాదం తీసుకుంటాని అభిషేక్ బచ్చన్ చెప్పాడు. అలాగే అశోక్ వాళ్ళ అన్నయ్య దీపక్ గత 50 సంవత్సరాల నుంచి మా నాన్న (అమితాబచ్చన్) కి మేకప్ మేన్ గా వ్యవహరిస్తుండడం విశేషం…
అశోక్ కి కొద్ది రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తను అసిస్టెంట్ ని నాకు మేకప్ మేన్ గా పంపిస్తున్నాడు. సార్ కి మేకప్ బాగా వేయండి అని చెప్పి మరి పంపిస్తున్నారట. ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా నా మేకప్ బాగుండాలని కోరుకున్నా అశోక్ దాదా అంటే నాకు అమితమైన ఇష్టం… ఆయన లేకుండానే నేను షూట్ లో పాల్గొనాలి, మేకప్ వేసుకోవాలనేది గుర్తొస్తేనే చాలా బాధేస్తోంది.
ఇక తను ఎక్కడున్నా కూడా తన ఆశీర్వాదం నాకు ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ఆయన కాళ్ళకి దండం పెట్టి తన ఆశీస్సులు తీసుకునేవాన్ని కానీ ఇప్పుడు మేకప్ వేసుకున్న తర్వాత సెట్ లోకి అడుగుపెట్టేముందు ఆకాశం వైపు చూసి అతన్ని మనసులో ప్రార్థించుకుంటాను. ఆయన ఎక్కడున్నా కూడా తన ఆశీస్సులు నాకు అందిస్తాడని అభిషేక్ బచ్చన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి…